SreeLeela: పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ శ్రీలీల. ఈ అమ్మడు మొదటి సినిమా ఫ్లాప్ అయినా రెండో సినిమా ఏకంగా మాస్ మహారాజ్ రవితేజకి జోడీగా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక ఈ మూవీ రిలీజ్ కాకుండానే నితిన్ కి జోడీగా, అలాగే రామ్ పోతినేనికి జోడీగా రెండు సినిమాలలో ఫైనల్ అయ్యింది. అదే సమయంలో బాలకృష్ణ సినిమాలో కూడా కీలక పాత్రకి ఎంపికైంది. ఇక ధమాకా రిలీజ్ తర్వాత ఈ అమ్మడు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీ షూటింగ్ లో కూడా పాల్గొంది.
ఇక తాజాగా మరో క్రేజీ ఆఫర్ ఈ అమ్మడు తలుపు తట్టింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో హీరోయిన్ గా శ్రీలీల కన్ఫర్మ్ అయ్యింది. ఈ మూవీ తమిళ్ హిట్ మూవీ తెరికి రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఇక తలో భాగంగా ఒరిజినల్ తరహాలోనే ఈ మూవీలో కూడా ఇద్దరు హీరోయిన్స్ ని స్థానం ఉంది. ఈ నేపధ్యంలో మొదటి హీరోయిన్ గా ఇప్పటికే పూజా హెగ్డే ఖరారు అయ్యింది.
ఇప్పుడు సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం శ్రీలీలని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఆమె పాత్రకి సినిమాలో మంచి ప్రాధాన్యత ఉంటుందనే మాట వినిపిస్తుంది. మొత్తానికి ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకోవడం ఇప్పుడు శ్రీలీల టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఈ నేపధ్యంలో వరుసగా సూపర్ స్టార్, పవర్ స్టార్ సినిమాలలో నటించే ఛాన్స్ ని సొంతం చేసుకోవడం విశేషం. త్వరలో శ్రీలీలని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.