అతిలోక సుందరి అంటే వెంటనే అందరూ టక్కున చెప్పే పేరు శ్రీదేవి. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మకుటం లేని మహారాణిగా కొన్ని దశాబ్దాల పాటు రూల్ చేసిన ఈమె అందానికి దాసోహం కానీ వారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత హీరోయిన్ గా మారిన శ్రీదేవి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా హీరోయిన్ గా సూపర్ సక్సెస్ తో నెంబర్ వన్ హీరోయిన్ గా మారిపోయింది. తరువాత బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ కూడా నెంబర్ వన్ హీరోయిన్ గా తన ప్రస్తానం కొనసాగించింది. బడి పంతులు సినిమాలో ఆమె తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్ఠీఆర్ మనవరాలిగా నటించింది. హీరోయిన్ అయ్యాక అదే ఎన్ఠీఆర్ కి హీరోయిన్ గా డ్యూయెట్స్ కూడా పాడింది. ఆమె తెలుగులో హీరోయిన్ గా పదహారేళ్ళ వయస్సు సినిమాతో మారింది.
తరువాత వెనక్కి తిరిగి చూడకుండా సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, ఎన్ఠీఆర్, ఏఎన్నార్, కృష్ణంరాజు లాంటి స్టార్ హీరోలతో నటించింది. అప్పటి యంగ్ స్టార్స్ గా ఉన్నమెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, వెంకటేష్ లతో కూడా ఆడిపాడింది. తమిళంలో కూడా కమల్ హాసన్, రజినీకాంత్ లాంటి స్టార్స్ కి జోడీగా శ్రీదేవి నటించింది. ఇలా సౌత్ లో ఉన్న అగ్రహీరోలు అందరి సరసన నటించిన అతిలోక సుందరి తరువాత బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ కూడా జెండా పాతేసింది. తెలుగు నేల నుంచి వెళ్లి బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరోయిన్ గా ఇప్పటికి ఆమె కీర్తి చిరస్ధాయిగా మిగిలిపోతుంది. ఇక బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలో జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాలో దేవకన్య ఇంద్రజగా నటించి తన పేరులో అతిలోక సుందరి అనేగుర్తింపుని నిలుపుకుంది.
సినీ జీవితంలో 200 పైగా చిత్రాలలో నటించిన హీరోయిన్ గా ఆమె అరుదైన గౌరవాన్ని కూడా సొంత చేసుకుంది. ఈ రోజుల్లో హీరోయిన్స్ కనీసం అరడజను సినిమాలు కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగలేకపోతున్నారు. అలాంటిది ఏకంగా 30 దశాబ్దాలకి పైగా ఆమె హీరోయిన్ గానే కొనసాగింది ఆంటీ శ్రీదేవి ఛరిస్మా ప్రేక్షకులని ఎంతగా ఆకట్టుకుందో చెప్పొచ్చు. ఈస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఊహించని విధంగా బోనీ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తరువాత పిల్లల కోసం కెరియర్ కొంత కాలం విరామం ఇచ్చి మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇంగ్లీష్ వింగ్లిష్ సినిమాతో రీ ఎంట్రీ గ్రాండ్ గా ఇచ్చింది. తరువాత మామ్ అనే సినిమాతో కూడా సక్సెస్ అందుకుంది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆమె చనిపోవడం ఇప్పటికి మిస్టరీగానే ఉంది. శ్రీదేవి పుట్టిన రోజు సందర్భంగా ఆమె కీర్తిని, గుర్తింపుని స్మరించుకోవడం ఎంతైనా అవసరం ఉంది.