Bigg boss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగులో ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. కంటెస్టెంట్లకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి హౌస్‌లో సందడి చేసి వెళుతున్నారు. తొలుత ఆదిరెడ్డి భార్య, కూతురితో సహా వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా శ్రీహాన్ కోసం సిరి.. వీరి ముద్దుల కొడుకు చైతన్య అలియాస్ చైతూతో కలిసి వచ్చింది. ఈ బుడ్డోడు హౌస్‌లో చేసిన సందడి అంతా ఇంతా కాదు. అందరినీ అనుకరిస్తూ ఆకట్టుకున్నాడు. శ్రీహాన్‌ను డాడీ.. డాడీ అంటూ తెగ అల్లరి చేశాడు. అయితే ఎవరీ బుడతడు అంటూ నెటిజన్లు మరోసారి చర్చించుకుంటున్నారు.
సిరి బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు కూడా ఈ చిన్నారి ప్రస్తావన వచ్చింది. అప్పట్లో కూడా ఈ చిన్నారి ఎవరంటూ పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అప్పట్లో రకరకాల కథనాలు నడిచాయి. ఆ తరువాత సిరి తల్లి శ్రీదేవి ఆ చిన్నారి ఎవరనే దానిపై క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ చిన్నారి సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడని ఒక కథనం.. అనాథ బాబు అంటూ మరో కథనం.. ఇలా రకరకాల కథనాలు వైరల్ అయ్యాయి. ఇంతకీ ఆ బాబు ఎవరో కాదు. సిరి మేనమామ కొడుకే ఈ చైతన్య అలియాస్ చైతు.
సిరి బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో ఆమె తల్లి శ్రీదేవి ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. సిరి పెంచుకుంటున్న కొడుకు తన తమ్ముడి కొడుకేననని తెలిపారు. సిరి బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో చైతూ తన తల్లిదండ్రుల వద్దే ఉన్నాడట. సిరి తన మేనమామ కొడుకుని దగ్గరకు తీయడంలో పెద్ద విశేషమేమీ లేదు కానీ శ్రీహాన్ కూడా దగ్గరకు తీయడమే ఆసక్తికరంగా మారింది. బిగ్‌బాస్ హౌస్ మొత్తాన్ని ఆ చిన్నారికి తిప్పి చూపించడం వంటివి చేశాడు శ్రీహాన్. బాబుతో శ్రీహాన్‌కు చాలా మంచి బాండింగ్ ఉందని ఎపిసోడ్ చూసిన వారెవరికైనా ఇట్టే అర్ధమై పోతుంది.