Srija devorce : గత కొంతకాలంగా ఇండస్ట్రీలో నడుస్తున్న హాట్ టాపిక్.. మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ తన రెండో భర్తతో కూడా విడాకులు తీసుకోబోతోందని. నిజానికి మెగా ఫ్యామిలీలో అంతిమంగా జరిగిన విషయం తెలుస్తుంది కానీ వేరే ఏ విషయాలు కూడా బయటకు రానివ్వరు. చాలా పెద్ద మిస్టరీగానే ఉండిపోతుంది. చిరు పెద్ద కూతురుతో హీరో ఉదయ్ కిరణ్ వివాహం నిశ్చితార్ధం వరకూ వచ్చి ఎందుకు ఆగిపోయిందో ఎవ్వరికీ తెలియదు. ఆ తరువాత చిన్న కూతురు శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని ఒక పాప పుట్టాక ఎందుకు విడిపోయిందో తెలియదు. ఆ తరువాత కళ్యాణ్ దేవ్ని పెళ్లి చేసుకుని ఎందుకు విడిపోతోందనేది కూడా పెద్ద మిస్టరీయే. అయితే తాజాగా ఒక వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Srija devorce : కలిసిపోయినట్టేనని సంబరపడుతున్న అభిమానులు
ఈ వీడియోను చూసి అంతా షాక్ అవుతున్నారు. శ్రీజ, కళ్యాణ్ కలిసిపోయారా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఆ వీడియోలో ఏముందంటే.. కళ్యాణ్ దేవ్, శ్రీజల కుమార్తె నవిష్క ఒక్కసారిగా తన తండ్రి వద్దకు వెళ్ళింది.ఈ క్రమంలోనే కళ్యాణ్ కూతురుతో కలిసి ఉన్న ఫోటోలను, వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. కూతురితో ఆడుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోను చూసిన వారంతా రకరకాలుగా స్పందిస్తున్నారు. వీరిద్దరూ కలిసిపోయినట్టేనని అభిమానులు సంబరపడుతుంటే.. కూతురిని చూసుకోవడానికి కోర్టు పర్మిషన్ ఇచ్చి ఉంటుంది.. దాని తాలూకు వీడియోనే అది అని కొందరు మాట్లాడుతున్నారు. ఇక అసలేం జరిగిందో ఏంటో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
గత కొన్నిరోజులుగా మెగా ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తుంది. మెగాస్టార్ చిన్నకూతురు శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవ్ విడిపోతున్నారని, దీంతో శ్రీజ మూడో పెళ్లికి సిద్ధమైందని విపరీతంగా టాక్ నడుస్తోంది. అంతేకాకుండా.. త్వరలోనే ఆమె ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోనుందని వార్తలు వచ్చాయి.ఇక కళ్యాణ్ దేవ్ కూడా ఎక్కడ కనిపించకపోవడం.. స్పందించకపోవడం ఈ వార్తలకు మరింత ఆజ్యం పోశాయి.కనీసం మెగా ఫ్యామిలీలో ఏ ఒక్కరూ కూడా ఈ వార్తలపై స్పందించకపోవడం ఆసక్తికరంగా మారింది. ఈ ఇష్యూపై కొందరు నటీనటులు, దర్శకనిర్మాతలు కూడా రియాక్ట్ అవుతుండటంతో ఈ ఇష్యూ కాస్తా జనాల్లో హాట్ టాపిక్ అయింది.