Chandan Kumar : ఒక సినిమా హిట్ అయ్యిందనో.. లేదంటే సీరియల్ బాగా నడుస్తోందనో దానిలో నటించే హీరోలు రెచ్చిపోయి టెక్నీయన్స్ విషయంలో నోటికి పని చెబితే.. వారు చేతికి పని చెబుతారు. ఇదే పరిస్థితి ఓ సీరియల్ హీరోకు ఎదురైంది. తానేదో పెద్ద తోపన్నట్టుగా బిహేవ్ చేసిన సీరియల్ హీరోకి టెక్నీషియన్ చేతితో బదులిచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ సదరు సీరియల్ హీరోకి బాగా బుద్ది చెప్పారని టెక్నీషియన్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇంతకీ ఆ సీరియల్ నటుడు ఎవరంటారా? తెలుగు సీరియల్ నటుడు చందన్ కుమార్.
Chandan Kumar : అంతా కలిసి తిరగబడ్డారు
‘స్టార్ మా’లో ప్రసారమైన ధారావాహిక సావిత్రమ్మ గారి అబ్బాయితో నటుడు చందన్ కుమార్ తెలుగు బుల్లితెరకు పరిచయమయ్యాడు. ప్రస్తుతం అతడు తెలుగులో ‘శ్రీమతి శ్రీనివాస్’ సీరియల్లో లీడ్ రోల్ పోషిస్తున్నాడు. రెండు సీరియల్స్ అంటే మాటలా అనుకున్నాడో ఏమో కానీ.. అబ్బాయిగారి ప్రవర్తనలో పెను మార్పే వచ్చింది. నేడు జరిగిన షూటింగ్లో చందన్ సిబ్బందితో చాలా దారుణంగా ప్రవర్తించాడు. సీరియల్‌కు పనిచేస్తున్న ఓ టెక్నిషియన్‌ను అమ్మ నుంచి మొదలుకుని నానా రకాల బూతులు తిడుతూ నోరు పారేసుకున్నాడు. ఇది ఆ టెక్నీషియన్‌కు మాత్రమే కాదు.. యూనిట్ మొత్తానికి ఆగ్రహం తెప్పించింది. అంతా కలిసి అబ్బాయిగారిపై తిరగబడ్డారు. ఈ క్రమంలోనే తన మదర్‌ను దూషించాడంటూ ఓ టెక్నిషియన్ చందన్ చెంప చెల్లుమనిపించాడు.
చందన్ తీరుపై అంతా మాటల దాడికి దిగారు. వ్యవహారం ఎంతకీ సద్దుమణగక పోవడంతో అక్కడే ఉన్న మిగతా సిబ్బంది చందన్‌తో టెక్నిషియన్‌కు క్షమాపణలు చెప్పించారు. అయినా కూడా కొందరు సిబ్బంది వెనక్కి తగ్గలేదు. చందన్ అనకూడని మాటలు అన్నాడని.. తన తల్లిని సైతం దూషించాడని అలాంటి వ్యక్తి ఇప్పుడు సారీ చెబితే ఊరుకుంటామా? అని సిబ్బందిలో ఓ వ్యక్తి వాదించాడు. ఇలా నటుడు చందన్ ఓవరాక్షన్ చేసి చెంప దెబ్బతిన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా చందన్ కన్నడ పరిశ్రమలో చాలా కాలంలో ఉన్నాడు. చందన్ హీరోగా కూడా ఒక సినిమా వచ్చింది. యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్గా ప్రేమ బరహా చిత్రంలో చందనే హీరో.