స్టార్ హీరోకి ఇంటికి
80, 90 దశకాల్లో హీరోగా రాణించిన సుమన్.. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. సుమన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శివాజీ చిత్రంలో విలన్ పాత్ర, అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వర స్వామి పాత్ర సుమన్ కి సరికొత్త ఇమేజ్ తీసుకువచ్చాయి.
అయితే సుమన్ ప్రస్తుతం రాజకీయాలపై కూడా ఆసక్తి చూపుతున్నారు. సినిమాల్లో నటిస్తూనే పొలిటికల్ కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తున్నారు. తెలంగాణాలో తాను బిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తానని సుమన్ ఓపెన్ గా కామెంట్స్ చేశారు. అయితే కొంతకాలంగా తన కుమార్తె గురించి వస్తున్న రూమర్స్ పై సుమన్ స్పందించారు.

సుమన్ కుమార్తె :
సౌత్ ఇండియాలో ఓ స్టార్ హీరో కుమారుడితో సుమన్ కుమార్తె వివాహం జరగబోతున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. దీనిపై సుమన్ స్పందిస్తూ.. నా కుమార్తె పేరు అఖిలజ ప్రత్యూష. ఆమె హ్యూమన్ జెనెటిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించింది. ఆమె ఓ స్టార్ హీరో ఇంటికి కోడలిగా వెళుతుంది అనే వార్తల్లో వాస్తవం లేదు.
నా కుమార్తెకి పెళ్లి చేసే ఆలోచన ఉంది. కానీ ఇప్పుడే కాదు. ఆమె చదువు పూర్తయ్యాకే నిర్ణయం తీసుకుంటా. ప్రత్యూషకి నటనపై ఆసక్తి లేదు అని కూడా సుమన్ క్లారిటీ ఇచ్చారు. అప్పట్లో సుమన్ ఒక వివాదంలో చిక్కుకోవడం అతడి కెరీర్ కి పెద్ద మైనస్ గా మారింది. తిరిగి వచ్చి సుమన్ మళ్ళి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు.