Sunny Leone : చాన్నాళ్ళ తర్వాత సన్నీ లియోన్ మరోసారి సోషల్ మీడియా లో సందడి చేసింది. ఈ బోల్డ్ బ్యూటీ తన హాట్ అందాలను ప్రదర్శిస్తూ యూత్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ చేసిన ఫోటో షూట్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలని చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

సన్నీ లియోన్ సార్టోరియల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్ అంటే చాలా మందికి ఇష్టం . ఆమె అందాలతో పాటు ఫ్యాషన్ ను ఆరాధించేవారు చాలామందే ఉన్నారు. తన అద్భుతమైన హాట్ రూపాన్ని మరింత అందంగా ఎలా మార్చుకోవాలో ఈ బ్యూటీ కి బాగా తెలుసు. సాధారణ అవుట్ ఫైట్స్ నుంచి బీచ్ లుక్స్ వరకు, పండుగ సందర్భాల్లో కూడా తన ఫ్యాషన్ డైరీలు వైవిధ్యభరితంగా ఉంటాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు. సన్నీ తాజాగో ఒక అద్భుతమైన ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్ కోసం జలకన్య అవతారం ఎత్తింది. జలకన్య లా కనిపించే డ్రెస్ వేసుకుని కెమెరాకు హాట్ భంగిమలు ఇచ్చి యూత్ కు నిద్ర లేకుండా చేస్తోంది.

ఫ్యాషన్ డిజైనర్ హౌస్ బోరా హనీస్కి మ్యూజ్ గా వ్యవహరించింది సన్నీ. ఈ డిజైనర్ హౌస్ షెల్ఫ్‌ల నుండి ఒక అందమైన సిల్వర్ కలర్ కో-ఆర్డ్ సెట్‌ను ఎంచుకుంది. డీప్ నెక్లైన్ , స్లీవ్ల వద్ద తెల్లటి ఫెథర్ వివరాలు కలిగిన కత్తిరించిన సిల్వర్ సీక్విన్డ్ బ్లౌజ్‌ను సన్నీ వేసుకుంది. ఈ బ్లౌజ్ కి వచ్చిన నెక్ లైన్ ద్వారా సన్నీ క్లీవేజ్ షో చేసి కుర్రాళ్ళను కన్ఫ్యూజ్ చేస్తోంది. ఈ బ్లౌస్ కి మ్యాచింగ్ గా అలల నమూనాలు కలిగిన విస్తృతమైన ట్రైన్ వివరాలు ఉన్న వెండి సీక్విన్డ్ బాడీకాన్ స్కర్ట్ ను ధరించింది.

సోనీ నీలమణి హౌస్ నుండి వెండి బ్రాస్లెట్ , స్టేట్మెంట్ ఫింగర్ రింగ్‌లను సేకరించి, సన్నీ తన రూపాన్ని మరింత అట్ట్రాక్టీవ్ గా మార్చుకుంది.

ఫ్యాషన్ స్టైలిస్ట్ హితేంద్ర కపోపారా ఈ బ్యూటీ కి స్టైలిష్ లుక్స్ అందించాడు. సన్నీ తన కురులను లూస్ గా వదులుకుని , కనులకు సిల్వర్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, బ్లాక్ మస్కరా తో పాటు పెదాలకు ప్రకాశవంతమైన ఎరుపు రంగు లిప్‌స్టిక్ దిద్దుకుంది. ఈ మేకోవర్ లో జలకన్యే భూమిని మీదకు వచ్చిందా అనేంత అందంగా కనిపించింది ఈ ముద్దుగుమ్మ.
