కడప లో నేడు దారుణం
ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లాలో నేడు దారుణం చోటుచేసుకుంది. ఎస్యూవీ ట్రక్కును ఢీ కొట్టగా, ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడిపత్రి హైవేపై ఈరోజు తెల్లవారుజామున కొండాపురం మండలం చిత్రావతి వంతెన సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బాధితులు తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఆలయంలో పూజలు చేసి తూఫాన్ వాహనంలో తిరిగి వస్తున్నారు.
ఎదురుగా వస్తున్న ట్రక్కును జీపు ఢీకొట్టింది.
ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఎనిమిది మందికి గాయాలయ్యాయి.
చీకట్లో ప్రమాదం జరగడంతో బాధితులను రక్షించేందుకు పోలీసులు చాలా కష్టపడ్డారు. క్షతగాత్రులను తొలుత తాడిపత్రిలోని ఆస్పత్రికి తరలించి అనంతరం అనంతపురం తరలించారు.
మృతులు, క్షతగాత్రులు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా తాడిపత్రికి, పొరుగున ఉన్న కర్ణాటకలోని బళ్లారికి చెందినవారు. బాధితుల్లో మహిళలు, పిల్లలు ఉన్నారు.
