Tapsi : సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్ను దక్షిణాదిన తెలుగు, తమిళ ప్రేక్షకులతో పాటు బాలీవుడ్లో వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకుంది. అటు వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తూ బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా ‘కాఫీ విత్ కరణ్’ హోస్ట్ కరణ్ జోహార్‌కు ఇచ్చిన దిమ్మ తిరిగే కౌంటర్ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. అమ్మడు కరణ్ జోహార్‌కు కౌంటర్‌గా.. తన శృంగార జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్ కథానాయికగా నటించిన చిత్రం ‘దొబారా’. ఆగస్ట్ 19న విడుదలకు సిద్ధమవుతోంది. స్పానిష్ చిత్రం మిరాజ్‌కి రీమేక్‌గా రూపొందిన చిత్రమే దొబారా.
ఇక సినిమా విడుదల అంటే ప్రచార కార్యక్రమాలు బీభత్సంగానే ఉంటాయిగా.. తెలుగు సినిమాలైతే జబర్దస్త్ వంటి షోస్‌లో సందడి చేస్తారు. ఇక బాలీవుడ్ అయితే కాఫీ విత్ కరణ్‌ను మించింది లేదు. అందుకే ఈ మధ్య కాలంలో విడుదలవుతున్న చిత్రాలు ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలకు సంబంధించిన హీరో హీరోయిన్లు కాఫీ విత్ కరణ్ సీజన్ 7 లో కనిపించి సందడి చేస్తున్నారు. కానీ తాప్సీ అండ్ టీమ్ మాత్రం హాజరు కాలేదు. ఇది ఓ రకంగా బాలీవుడ్లో హాట్ టాపిక్‌గానే మారింది. ఇదే ప్రశ్నను తాప్సీ పన్నుని మీడియా ప్రశ్నించగా.. ఆమె తనదైన స్టైల్లో కరణ్ జోహార్‌పై వ్యంగ్యాస్త్రాలను సంధించింది. ‘‘కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో పాల్గొనేంత గొప్పగా నా శృంగార జీవితం లేదు’’ అని ఘాటుగా బదులిచ్చింది.
Tapsi : శృంగార జీవితానికి సంబంధించిన ప్రశ్నలనే అడగటం సర్వసాధారణం
అమ్మడి ఆన్సర్‌కి నెటిజన్లు షాక్ అయినా కూడా.. కరణ్‌కు మాత్రం అదిరిపోయే ఝలక్ ఇచ్చిందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ షోలో పాల్గొనే వారందరినీ ఎక్కువగా కరణ్ వారి శృంగార జీవితానికి సంబంధించిన ప్రశ్నలనే అడుగుతుండటం సర్వసాధారణంగా మారిపోయింది. దీనిపై చాలా విమర్శలు వస్తున్నా కూడా ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదు. విజయ్ దేవరకొండ, అనన్య పాండే, ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ వంటి స్టార్స్ ఈ షోలో కరణ్ అడిగిన సెక్స్ లైఫ్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కరణ్ జోహార్ అడిగే సెక్స్ లైఫ్ ప్రశ్నలు చాలా ఇబ్బందికరంగా ఉండటంతో తాప్సీ ఇలా ఘాటుగా రియాక్ట్ అయ్యిందని టాక్.