Tamannaah Bhatia : ట్రెండ్స్ వస్తుంటాయి పోతుంటాయి. కానీ అందులో కొన్ని ట్రెండ్లు మాత్రం ఎప్పటికీ మనతోపాటే జీవితాంతం కొనసాగుతాయి. కటౌట్లు ఫ్యాషన్ సీన్లోకి ప్రవేశించినప్పటి నుంచి తారల ఫేవరేట్ అవుట్ ఫిట్స్‌గా మారిపోయాయి. పార్టీనైట్స్ అయినా , ఫంక్షన్లైనా, అవార్డుల వేడుకలైనా అభిమాన తారలు అదిరిపోయే కట్ అవుట్ డ్రెస్‌లను ధరించి అందరిని మంత్రముగ్ధులను చేస్తుంటారు. తాజాగా సౌత్ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్లో బిజీ అయిన నటి తమన్నా భాటియా అదిరిపోయే అవుట్‌ఫిట్‌తో కెమెరాకు చిక్కి అందరిని తన అందాలతో కట్టిపడేసింది.

టాలీవుడ్ లో మిల్కీ బ్యూటీగా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న తమన్నా ప్స్తుతం బాలీవుడ్ లో అందివచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. సినిమాలతో పాటుగానే హాట్ ఫోటో షూట్లు చేస్తూ సోషల్ మీడియాలోను ఫాలోవర్స్‌ను విపరీతంగా పెంచేసుకుంటోంది ఈ బ్యూటీ.

తాజాగా తమ్ము ఎల్లే గ్రాడ్యుయేట్స్ 2022 వేడుకకు కటౌట్ డ్రెస్ లో హాజరై అందరి చూపును తనవైపుకు తిప్పుకుంది. కటౌట్ల ప్రపంచంలోకి సరికొత్తగా ప్రవేశించిన ఈ చిన్నది ఆమె ఇతర ట్రెండ్‌ను అదరగొట్టినట్లే ఇందులోనే అందరి మతులు పోగొట్టేసింది.

ఈ వేడుక కోసం తమన్నా ప్రకాశవంతమైన రాయల్ బ్లూ కలర్ బాడీకాన్ అవుట్‌ఫిట్‌ను ఎంచుకుంది. కటౌట్ వివరాలు కలిగిన ఈ అవుట్‌ఫిట్ లో కత్తిలా కనిపించింది ఈ మిల్కీ బ్యూటీ. స్టేట్మెంట్ ఫ్లౌన్సీ షోల్డర్ నుంచి వచ్చిన బోల్డ్ వి-నెక్లైన్తో అద్భుతంగా డిజైన్ చేసిన ఈ టైట్‌ఫిట్ దుస్తుల్లో తన షేప్స్ ను చూపించి కిక్కిచ్చింది ఈ చిన్నది. డీప్ నెక్లైన్ ఆమె ముందు భాగాన్ని స్పష్టంగా చూపిస్తూ టెంప్ట్ చేస్తోంది. అసలు ఫ్రంట్‌లో డ్రెస్ ఉందా అన్న అనుమానం కలిగిస్తోంది.

తమన్నా తాజాగా ఈ డ్రెస్ లో చేసిన హాట్ ఫోటో షూట్ పిక్స్ ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. అమ్మడి బోల్డ్ పిక్స్ చూసి ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అవుతోంది. ఈవెంట్లో అందరి దృష్టిని తనవైపుకు మళ్లించాలనే ఏకైక ఉద్దేశ్యంతోనే అన్ని వైపులా కటౌట్లు ఉన్న ఈ డ్రెస్ ను ఎన్నుకుందని ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ అవుట్‌ఫిట్‌ను గ్నామా డాట్ ఇన్ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎంపిక చేసుకుంది తమన్నా. అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా ఆమె చెబుతకు పెద్ద బంగారు చెవిపోగులను అలంకరించుకుంది. లౌబౌటిన్ వరల్డ్ నుంచి ఎంపిక చేసుకున్న పింక్ హీల్స్‌ను పాదాలకు వేసుకుని వయ్యారంగా నడిచి అందరిని మంత్రముగ్ధులను చేసింది. ఈ లుక్కు తగ్గట్లుగా గ్లామరస్ మేకోవర్ చేసుకుంది మిల్కీ బ్యూటీ.

ప్రముఖ సెలబ్రిటీ స్టైలిస్ట్ షలీనా నతానీ తమన్నాకు స్టైలిష్ లుక్స్‌ను అందించింది. అందమైన హెయిర్‌స్టైల్ ను టీనా ముఖర్జీ అందించింది. మేకప్‌ను సవ్లీన్ మన్‌చందా చేసింది.