సౌత్ ఇండియా హాట్ బ్యూటీ, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది. కుర్ర హీరోలు, అలాగే ప్రస్తుతం ఉన్న యంగ్ స్టార్స్ అందరూ కొత్త హీరోయిన్స్ వెంట పడుతున్నారు. దీంతో నయనతార, తమన్నా, కాజల్ లాంటి లాంటి హీరోయిన్స్ సీనియర్ హీరోలకి పెయిర్స్ గా మారిపోయారు. ఇక తమన్నా ఇప్పటికే చిరంజీవికి జోడీగా సైరా నరసింహా రెడ్డి సినిమాలో ఆడిపాడింది, అలాగే వెంకటేష్ కి జోడిగా ఎఫ్ ఫ్రాంచైజ్ లో చేసింది. ఇక యంగ్ నాగార్జునకి కూడా జోడీ కట్టబోతుంది అనే మాట వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ని తమన్నా సొంతం చేసుకుంది.
నెల్సన్ దిలీప్ కుమార్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ తో జైలర్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే మొదలయ్యాయి. ఇందులో రజినీకాంత్ కి జోడీగా ముందుగా ఐశ్వర్య రాయ్ ని అనుకున్నారు. అయితే ఏవో కారణాల వలన ఆమె చేయడానికి ముందుకి రాలేదు. దీంతో ఐశ్వర్య రాయ్ స్థానంలో ఇప్పుడు తమన్నా భాటియాని హీరోయిన్ గా ఖరారు చేశారని తెలుస్తుంది. త్వరలో అధికారికంగా కూడా ఈ విషయాన్ని ద్రువీకరించబోతున్నారు. ఇక ఈ సినిమాలో రజినీకాంత్ కి ప్రతినాయకిగా రమ్యకృష్ణ నటించబోతుంది.
23ఏళ్ల తర్వాత రజినీకాంత్, రమ్యకృష్ణ మళ్ళీ స్క్రీన్ పై ప్రత్యర్ధులుగా కనిపించబోతుండటం ఇప్పుడు ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి తమన్నా సీనియర్ హీరోయిన్ అయ్యి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు సొంతం చేసుకోవడం నిజంగా విశేషమని చెప్పాలి. ఇక ఈ సినిమాలో రజినీకాంత్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. మెజారిటీ షూటింగ్ హైదరాబాద్ లోనే జరగననున్నట్లు సమాచారం. రజినీకాంత్ ఆరోగ్య దృష్ట్యా అతని సినిమాలు ఎక్కువగా స్టూడియోలలో సెట్స్ వేసి పూర్తి చేస్తున్నారు.