RRR Oscar: ప్రస్తుతం టాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ విషయంలో సెలబ్రిటీల మధ్య గొడవ జరుగుతుంది. తమ్మారెడ్డి భరద్వాజ కొద్ది రోజుల క్రితం ఓ మూవీ ఈవెంట్ లో మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ ప్రమోషన్ కోసం 80 కోట్లు ఖర్చు చేసారని, ఆ డబ్బులు తనకి ఇస్తే ఎనిమిది సినిమాలు తీసి వారి ముఖాన కొట్టేవాడిని అంటూ కామెంట్స్ చేశారు. దీనిపై వెంటనే సోషల్ మీడియాలో కౌంటర్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే మెగా బ్రదర్ నాగబాబు కూడా రియాక్ట్ అయ్యి తమ్మారెడ్డి మీద విమర్శలు చేశారు. అయితే ఆయన కాస్తా ఘాటుగా నీ అమ్మ మొగుడు 80 కోట్లు పెట్టాడా అంటూ పరుష పదజాలం వాడారు.
అలాగే రాఘవేంద్ర రావు కూడా విమర్శలు చేశారు. 80 కోట్లు ఖర్చు చేసినట్లు మీ దగ్గర అకౌంట్స్ ఉండే కొద్దిగా చూపించండి అంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే వీరి వ్యాఖ్యలపై తమ్మారెడ్డి మళ్ళీ తిరిగి కౌంటర్ ఇచ్చారు. నేను మూడు గంటలు జరిగిన సెమినార్ లో వన్ మినిట్ మాట్లాడిన మాటలు వినేసి తన మీద ఇష్టానుసారం కామెంట్స్ చేస్తున్నారని అన్నారు. ఒకరు నీ అమ్మ మొగుడు ఇచ్చాడా అంటూ కామెంట్స్ చేశారు. నా అమ్మ మొగుడు నాకు సంస్కారం నేర్పించారు. నిజం మాట్లాడటం నేర్పించారు. నిజాయితీగా బ్రతకడం నేర్పించారు. అందుకే నేను నిజాలు మాట్లాడుతున్నా.
అయినా మీరా నన్ను విమర్శించేది కులాలు, మతాల గురించి మాట్లాడే మీరు కూడా నా మీద విమర్శలు చేస్తారా? ఎంత సేపు వాళ్ళకి వీళ్ళకి కళ్ళు ఒత్తడం ద్వారా జీవితం గడుపుకునే మీరు కూడా నామీద విమర్శలు చేస్తారా అంటూ ఘాటుగా స్పందించారు. నేను నోరు విప్పితే మీ భాగోతాలు అన్ని బయటకి వస్తాయి. కాని నాకు సంస్కారం అడ్డు వస్తుంది. మీరు బరితెగించిన విధంగా నేను మాట్లాడలేను. ఇన్నాళ్ళు మీరు నేను ఒకటే అనుకున్నా, ఇప్పటి అనుకుంటున్నా కాని మీరు మాత్రం నా మీద ఇలా అసందర్భంగా మాట్లాడారు. ఈ మాటలు మీ విజ్ఞతకి వదిలేస్తున్న అంటూ మీడియాలో విమర్శలు చేశారు. ఇప్పుడు ఈ కామెంట్స్ మరో సారి వైరల్ గా మారాయి.