ఝమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ తాప్సి పన్ను. ఈ బ్యూటీ తెలుగులో ఎంట్రీ ఇచ్చిన తర్వాత గ్లామర్ పాత్రలకి కేరాఫ్ గా మారింది. వరుస అవకాశాలని అందుకుంటూ స్టార్ హీరోయిన్ అయ్యింది. స్టార్ హీరోలకి జోడీగా నటించిన కూడా మెజారిటీ సినిమాలలో ఈమె సెకండ్ లీడ్ రోల్స్ కి మాత్రమే తెలుగు మేకర్స్ తీసుకున్నారు. ఇక అగ్ర హీరోల సరసన కమర్షియల్ సినిమాలలో నటించిన అవి కేవలం పాటలకి పరిమితం అయ్యే పాత్రలే తప్ప పేరు తెచ్చుకున్న క్యారెక్టర్స్ పెద్దగా లేవు. ఇక తెలుగులో అవకాశాలు తగ్గిన తర్వాత బాలీవుడ్ లో అడ్డుగుపెట్టిన ఈ బ్యూటీకి అక్కడ వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఎక్కువగా ఫిమేల్ సెంట్రిక్ కథలకి ఆమె కేరాఫ్ అడ్రెస్ గా మారింది.
తక్కువ బడ్జెట్ తో విమెన్ ఓరియంటెడ్ సినిమాలు తీసే దర్శకులు ఆమెతో వరుసగా చిత్రాలు చేశారు. ఇవి హిట్ కావడంతో ఆమె ఆ తరహా కథలతోనే ట్రావెల్ అవుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో విమెన్ సెంట్రిక్ కథలు అంటే తాప్సి పేరు వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి వచ్చి 14 ఏళ్ల కెరియర్ ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తన అనుభవాలని మీడియాతో పంచుకుంది. ఇండస్ట్రీలో తాను ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పటికి హీరోయిన్స్ విషయంలో వివక్ష కొనసాగుతూనే ఉందని ఈ బ్యూటీ వాపోయింది. హీరోలతో పోల్చుకుంటే తమకి రెమ్యునరేషన్ నుంచి అన్ని విషయాలలో తక్కువగానే చూస్తారని, సౌకర్యాలు కల్పిచడంలో కూడా వ్యత్యాసం ఉంటుందని పేర్కొంది.
సినిమా అన్న తర్వాత హీరోలతో పాటు హీరోయిన్స్ కూడా ఉంటారని కాని రెమ్యునరేషన్ దగ్గరకి వచ్చేసరికి ఈ తేడాలతో దారుణంగా ఆడవాళ్ళని అవమానిస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేసింది. ఓ విధంగా ఈమె చేసిన వ్యాఖ్యలు నేరుగా టాలీవుడ్ మేకర్స్ ని తాకుతాయి. ఈమె ఎక్కువ కాలం హీరోయిన్ గా తెలుగులోనే కొనసాగింది. ఈ నేపధ్యంలో ఆమె వ్యాఖ్యలు టాలీవుడ్ గురించే అనే మాట వినిపిస్తుంది. అయితే తాను నిర్మాతగా మారిన తర్వాత అందరిని ఒకేలా చూస్తున్నానని, ఆడ, మగ అని తేడా లేకుండా ఇద్దరకి సమాన ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పుకొచ్చింది. తాప్సి గతంలో కూడా టాలీవుడ్ దర్శకుల మీద నోరుజారి మాట్లాడింది. మరల ఇప్పుడు సౌత్ లో హీరోయిన్స్ ని చిన్న చూపు చూస్తారని ఈమె చేసిన వ్యాఖ్యలు ఎంత వరకు వెళ్తాయి అనేది వేచి చూడాలి.