Taraka Ratna : బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్న టాలీవుడ్ సినీ నటుడు నందమూరి తారకరత్నతుది శ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో జనవరి 27న యువ గళం పేరుతో నారా లోకేష్ నిర్వహించిన రోడ్‌షో కార్యక్రమంలో తారక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తారక్‌కు గుండెపోటు రావడంతో అకస్మాత్తుగా మూర్ఛపోయారు. దీంతో హుటాహుటిన తారక్‌ను హాస్పిటల్‌కు తరలించారు. గత 23 రోజులుగా తారక్ ఐసీయూలోనే మంచంపైనే చికిత్స పొందుతున్నాయి.

సంఘటన జరిగిన వెంటనే, తారక్‌కు సీపీఆర్ తో పాటు ఇతర ప్రాథమిక చికిత్సను అందించారు. తరువాత కుప్పం సమీపంలోని హాస్పిటల్ తరలించారు. కుప్పంలోని ఆసుపత్రికి తీసుకురావడానికి ముందు తారక్ గుండె కొన్ని నిమిషాలపాటు పనిచేయడం ఆగిపోయిందని, ఆ తరువాత కోలుకున్నారని వైద్యులు తెలిపారు. అనంతరం 28న తెల్లవారుజామున 2 గంటలకు చికిత్స నిమిత్తం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిగా తీసుకెళ్లారు. అధునాతన ట్రీట్‌మెంట్ అందిస్తూ వస్తున్నారు.

అప్పటి నుండి దాదాపు 23 రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు తారక్. కొన్ని రోజుల క్రితం హాస్పిటల్ యాజమాన్యం తారక రత్నచికిత్స కోసం అమెరికా నుండి కొంతమంది కార్డియాలజీ నిపుణులను తీసుకువచ్చారు. రెండు రోజుల క్రితం బెలూన్ యాంజియోప్లాస్టీ, ఇంట్రా అయోర్టిక్ బెలూన్ పంప్, వాసోయాక్టివ్ సపోర్ట్ శంటి ఇతర అధునాతన కార్డియో సేవలను చికిత్సలో భాగంగా అందించినట్లు వైద్యులు పేర్కొన్నారు.

నందమూరి తారక రత్న వయస్సు 39 సంవత్సరాలు. ఆయన భార్య అలేఖ్య రెడ్డి , ఒక కుమార్తె ఉన్నారు. అతని తండ్రి నందమూరి మోహన్ కృష్ణ టాలీవుడ్‌లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ . తారక ప్రముఖ తెలుగు నటుడు ,ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మనవడు. టాలీవుడ్ సూపర్ స్టార్ నందమూరి బాలకృష్ణ మేనల్లుడు.

తారక రత్న 2002లో కోదండరామి రెడ్డి దర్శకత్వంలో ఒకటో నంబర్ కుర్రాడు అనే రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా తెరంగేట్రం చేశారు. ఆ తరువాత చాలా వరకు సినిమాల్లో కీలక పాత్రను పోషించాడు. తారక్ చివరిసారిగా గత సంవత్సరం విడుదలైన సారధి సినిమాలో కనిపించారు. అతను 2022లో 9 అవర్స్ అనే వెబ్ సిరీస్ తో తన OTT అరంగేట్రం చేశారు. 2009లో విడుదలైన అమరావతి చిత్రంలో నటనకు గానూ తారకరత్న రాష్ట్ర ఉత్తమ విలన్‌గా నంది అవార్డు అందుకున్నారు.
మహా శివరాత్రి పవిత్రమైన రోజున తారక్ తుది శ్వాశ విడిచారు. కుటుంబసభ్యులు, పలువురు టాలీవుడ్ ప్రముఖులు అతని మరణానికి సంతాపం తెలిపారు. తారకరత్న భౌతికకాయాన్ని అభిమానులు , ప్రజల నివాళులర్పించేందుకు సోమవారం ఉదయం తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఉంచనున్నారు, అదే రోజు సాయంత్రం మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.