YS Jagan: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసీపీ తనదైన వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకు దూసుకెళ్తుంది. వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచి అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి జగన్ గట్టిగా ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్లో విశ్వసనీయతని సొంతం చేసుకున్న ముఖ్యమంత్రి జగన్ మరింత బలంగా ప్రజలకు చేరువ కావడంలో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ప్రతిపక్షాలు పదేపదే తమ అనుకూల మీడియా ద్వారా విష ప్రచారం చేస్తున్న కూడా దానిని బలంగా తిప్పికొడుతూ ప్రజలకు తానేంటి అనేది ముఖ్యమంత్రి జగన్ చూపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి. ప్రతిరోజు ప్రతిపక్షాలు తనపై విమర్శలు చేస్తున్న కూడా వాటన్నింటికీ జగన్ ఒకేసారి ఒకే వేదిక మీద సమాధానాలు చెప్పి పుల్ స్టాప్ పెడుతూ ఉండడం ఏపీ రాజకీయాలలో ఆసక్తికరమైన అంశంగా మారింది.
అదే సమయంలో 175 కు 175 స్థానాలలో కూడా పోటీ చేసి గెలవడమే తమ లక్ష్యం అంటూ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా గెలుపుపై ఎంత నమ్మకంగా ఉన్నది చెప్పకనే చెబుతున్నారు. ముఖ్యంగా టీడీపీ జనసేన బలహీనతలను పదేపదే ఎత్తి చూపిస్తూ వారి ఓటు బ్యాంకును కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దమ్ముంటే 175 నియోజకవర్గాలలో ఒంటరిగా పోటీ చేయాలంటూ ముఖ్యమంత్రి జగన్ తెనాలి సభలో ఛాలెంజ్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిపక్షాలు భుజాలు తడుముకోవడం తప్ప సరైన సమాధానం చెప్పలేకపోయారు.
దీనిని బట్టి జనసేన, టీడీపీ కలిసి ఎన్నికలలో పోటీ చేస్తాయని విషయాన్ని జగన్ బహిర్గతం చేశారనే మాట ఇప్పుడు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఈ రెండు పార్టీలు జతకట్టిన కూడా వైసీపీ గెలుపును ఆపలేరని జగన్ ధీమాగా తమ నాయకులు వద్ద చెబుతున్నట్లు తెలుస్తుంది. వారిద్దరూ కలవడం ద్వారా మరింతగా మనం 175 స్థానాల గమ్యానికి చేరు అయినట్లే అని బలంగా సూచిస్తున్నట్లు సమాచారం. జనసేన పార్టీకి గ్రౌండ్ లెవెల్ లో ఎలాంటి క్యాడర్ లేదు పవన్ కళ్యాణ్ ఏదో టీడీపీ తో జతకట్టి ఒకటి రెండు స్థానాల్లో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని అనుకుంటున్నారు. దాన్ని కూడా దెబ్బతీసే విధంగా అతని విశ్వసనీయతను జగన్ ప్రశ్నిస్తున్నారు.