TDP: గత ఎన్నికలకి ముంది టీడీపీ అవినీతిపై వైసీపీ నేతలు ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అవినీతిపై విచారణ చేపడతామని ముఖ్యమంత్రి జగన్ చాలా గట్టిగానే చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పుస్తకం ఊసే లేదు. కనీసం ఏ ఒక్క కోణంలో కూడా చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగింది అని నిరూపించే ప్రయత్నం కూడా వైసీపీ అధిష్టానం చేయలేకపోయింది.
అయితే ఇప్పటికి కూడా ప్రజలని మాత్రం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎన్నికలకి ముందు వివేకానంద హత్యని కూడా చంద్రబాబు నాయుడు మీదకి నెట్టేసి నారాసుర రక్తచరిత్ర అని తమ పత్రికలో ఫ్రంట్ పేజీలో ప్రచురించుకున్నారు. ఇక ఈ అంశాన్ని కూడా పెద్దది చేసి వివేకానందని హత్య చేసింది చంద్రబాబు నాయుడు టీమ్ అంటూ ప్రచారం చేశారు.
ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మడం కూడా వైసీపీకి భారీ మెజారిటీ రావడానికి ఒక కారణం అయ్యిందని చెప్పాలి. అయితే ఇప్పుడు వివేకానంద హత్యకేసులో ఉన్న ముద్దాయిలు అందరూ కూడా వైసీపీ పార్టీకి చెందిన వారు. అది కూడా వైఎస్ జగన్ కి సన్నిహితులు అని సీబీఐ నిర్ధారించింది. ఇక వారిని అరెస్ట్ కూడా చేసింది. ఇక వివేకానంద హత్యకేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా కొద్ది రోజుల క్రితం సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య నేపధ్యంలో ఇప్పుడు టీడీపీ జగనాసుర రక్తచరిత్ర అంటూ ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు. దీనిని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తాజాగా ఆవిష్కరించారు.
అధికారంలోకి రావడం కొడం కోడికత్తి డ్రామా ఆడిన జగన్ రెడ్డి చివరికి తన రాజకీయ ప్రయోజనాల కోసం సొంత బాబాయ్ ని కూడా హత్యచేయించే స్థితికి దిగజారిపోయారని అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా విమర్శించారు. ఇక ఇప్పుడు అవినాష్ రెడ్డిని కాపాడుకునే ప్రయత్నంలో జగన్ రెడ్డి ఉన్నారని అన్నారు. వాళ్ళే హత్య చేసి దానిని చంద్రబాబు మీదకి నెట్టేసి రాజకీయ లబ్ది పొందారని, అధికారంలోకి వచ్చాక ఆ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేశారని అన్నారు. ఇలాంటి దుష్ట రాజకీయాలకి ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుందని అచ్చెన్నాయుడు విమర్శించారు.