Tejaswi Madivada : తేజస్వి మదివాడ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో. ఒకటి కాదు.. ఏకంగా ఈ ముద్దుగుమ్మ రెండు సార్లు తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షోలో సందడి చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ హాట్ హాట్ పోజులతో మతిపోగొడుతుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో అభిమానులకు అందుబాటులో ఉంటూ తన బోల్డ్ పిక్స్‌తో నెటిజన్లకు చెమటలు పట్టిస్తుంటుంది. ఈ అందాల భామ మరోసారి ఇంటర్నెట్‌ని తన డ్యాన్స్‌తో షేక్ చేస్తోంది. పనిలో పనిగా కమిట్మెంట్ గురించి కూడా చెప్పబోతోంది. కమిట్మెంట్ అంటే ఏంటో అనుకునేరు.. తను చేసిన సినిమాయే ‘కమిట్మెంట్’. క్రేజీ టైటిల్ కదా.. దీంతోనే రచ్చ లేపుతోంది.
Tejaswi Madivada : లిప్ కిస్సుల్లో మునిగి తేలిన జంటలు..
సినిమా పేరే అంటే అందులో నటించింది.. తేజస్వి కావడంతో ఈ సినిమాపై హీట్ పెరుగుతోంది. ‘కమిట్మెంట్’లో కంటెంట్ ఏంటి? జోనర్ ఏంటి? అని అప్పుడే ప్రేక్షకులు ఆరా తీయడం మొదలు పెట్టారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది. దీనిలో బ్యాక్‌గ్రౌండ్‌లో భగవద్గీత శ్లోకం వినిపిస్తుండగా.. నాలుగు జంటలు లిప్ కిస్సుల్లో మునిగి తేలుతుంటారు. ఇది చాలా వివాదాస్పదంగా మారింది. మొత్తానికి దీనిపై పెద్ద రచ్చే జరగడంతో తరువాత సీన్లను తొలగించినట్టు సమాచారం. ఈ నాలుగు జంటల్లో తేజస్వి మదివాడ జంట ఒకటి. ఈ నాలుగు జంటలకు సంబంధించిన కథే.. ‘కమిట్మెంట్’.
ఈ సినిమాలో అమ్మడి పాత్ర చాలా బోల్డ్‌గా ఉంటుందట. మొత్తానికి ఈ సినిమా పేరుతోనే జనంలోకి వెళ్లిపోయింది. తాజాగా సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా వెల్లడిస్తూ విడుదల చేసిన పోస్టర్లోనూ అమ్మడి లుక్ చాలా హాట్‌గా ఉంది. ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. మరోవైపు అమ్మడు ఓ డ్యాన్స్ వీడియోని షేర్ చేసింది. ఈ వీడియోలో అమ్మడు సల్సా డ్యాన్స్‌తో అదరగొట్టింది. సూర్యరశ్మిలో పరవసించిపోయి మరీ తేజస్వి మడివాడ చేసిన ఈ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దాదాపు ఐదేళ్ల తర్వాత అమ్మడు నటించిన ‘కమిట్మెంట్’ సినిమా ఆగస్ట్ 19న విడుదల కాబోతోంది.