Steel Plant: వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు పోరాటం రెండేళ్ళుగా కొనసాగుతుంది. ఇదే సమయంలో ప్రైవేటీకరణకు సంబంధించి బిడ్డింగ్ గడువు సమీపిస్తోంది. ఇలాంటి సమయంలోనే బీఆర్ఎస్ పార్టీ స్టీల్ ప్లాంట్ కోసం బిడ్ వేసేందుకు సిద్దమైంది. తెలంగాణ ప్రభుత్వ పెద్దల ప్రకటనలు గత కొద్ది రోజులుగా స్టీల్ ప్లాంట్ పై ప్రకటనలు చేస్తున్నారు. బయ్యారం గనులను, విశాఖ ఉక్కును అడానికి అమ్మేస్తున్నారని ఆరోపించిన కేటీఆర్ ఆరోపించారు.. బీజేపీ చర్యని అడ్డుకుంటామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రకటనలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నలు లేవదీసారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం అంటూనే దీనిపై బీఆర్ఎస్ పార్టీ స్పష్టత ఇవ్వాలని అడిగారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారని అమర్నాథ్ పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని సీఎం జగన్ గళం వినిపించారు. ప్రధానికి లేఖ రాశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు పార్లమెంట్‌లో నిలదీశారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతుగా నిలిచింది. మా పార్టీ, మా ప్రభుత్వం కార్మికుల పక్షానే ఉందని అమర్నాథ్ పేర్కొన్నారు.
ఈవోఐలో భాగంగా స్టీల్‌ప్లాంట్‌కు సింగరేణి అధికారులు. స్టీల్‌ప్లాంట్ ఫండ్ రైజింగ్‌లో భాగంగా ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసుకొనేందుకు సింగరేణి అధికారులు వైజాగ్ వచ్చారు. ఈ చర్యను ప్లాంట్ రా మెటీరియల్ కాస్ట్ తగ్గించుకునే వ్యూహంగానే వైసీపీ చూస్తోంది. అయితే బీఆర్ఎస్ పార్టీ స్టీల్ ప్లాంట్ ని తెలంగాణ ప్రభుత్వం తరపున బిడ్ లో పాల్గొని కొనుగోలు చేయాలని భావిస్తుంది. దీనిపై విపక్షాలు వైసీపీని ప్రశ్నిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఏపీ ప్రభుత్వమే కొంటుందని చెప్పిన జగన్ ఇప్పుడు ఎక్కడికి పోయారంటూ నిలదీస్తున్నారు. అయితే బీఆర్ఎస్ పొలిటికల్ గేమ్ లో భాగంగా దీనిని తెరపైకి తెచ్చినట్లు వైసీపీ భావిస్తుంది.