హీరోయిన్ల లవ్ మ్యాటర్స్, డేటింగ్ సంగతులు, పెళ్లి ముచ్చట్లు వార్తల్లో నిలుస్తూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ విశేషాలపై ఆరాతీసే వాళ్ళైతే బోలెడంత మంది. ఈ క్రమంలోనే తాజాగా యంగ్ హీరోయిన్ తాప్సి పెళ్లి విషయమై
ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకొచ్చింది. తన ప్రియుడితో తాప్సి పెళ్ళికి రెడీ అయిందని, ఇందుకు గాను ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారని సమాచారం.
గత కొంతకాలంగా డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథ్యూస్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్న తాప్సి అతనితో మూడు ముళ్ళు వేయించుకునేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న ఈ ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారని సమాచారం. అతిత్వరలో ఈ వేడుక జరగనుందని, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే టాక్ బయటకొచ్చింది. దీంతో మరోసారి తాప్సి పెళ్లి మ్యాటర్ హాట్ టాపిక్ గా మారింది.
గతంలో తన పెళ్లి గురించి స్పందించిన తాప్సి.. సినీ రంగానికి చెందిన వ్యక్తిని పెళ్లాడటం ఇష్టం లేదని చెబుతూ మాథ్యూస్‌తో పెళ్లిపై ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చింది. మ్యాథ్యూస్ తనకు బాగా తెలిసిన వ్యక్తి, సన్నిహితుడని చెపుతుంది. ప్రస్తుతం సంవత్సరానికి ఆరు సినిమాలు చేస్తున్నానని, ఆ సంఖ్య రెండు లేదా మూడుకు తగ్గినపుడే పెళ్ళి చేసుకుంటానని కూడా అంటుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి తాప్సి పెళ్లిపైనే ఉంది.
‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఢిల్లీ భామ తాప్సి.. ఆ తర్వాత కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్కడి నుంచి బాలీవుడ్ బాట పట్టింది. ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బీటౌన్‌లోని స్టార్ హీరోయిన్ల సరసన ఉంటుంది. తెలుగు లో చాలాకాలం తర్వాత మిషన్ ఇంపాజిబుల్ సినిమా చేస్తోంది.