ప్రముఖ వ్యాపారవేత్త శరవణన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సౌత్ లో అతనికి టెక్స్ టైల్ స్టోర్స్ చాలా ఉన్నాయి. వేల కోట్ల రూపాయలతో వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఇంకో కారణం కూడా ఉంది. శరవణన్ తాజాగా భారీ బడ్జెట్ తో లెజెండ్ అనే పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమాకి ఏకంగా 60 కోట్ల వరకు బడ్జెట్ పెట్టినట్లు మీడియా ముఖంగానే చెప్పాడు. అతనే హీరోగా నటిస్తూ ఈ సినిమాని నిర్మిచడం మరో విశేషం. అతని లుక్స్ చాలా డిఫెరెంట్ గా ఉంటాయి. ఓ విధంగా చెప్పాలంటే తెలుగులో సంపూర్ణేష్ బాబు తరహాలో అతని స్టైల్ ఉంటుంది. అయితే డబ్బులు దండిగా ఉండటంతో తానే నిర్మాతగా తనని తాను హీరోగా ప్రమోట్ చేసుకుంటూ సినిమా చేసేసాడు.
అది కూడా స్టార్ హీరోల రేంజ్ లో అదిరిపోయే కమర్షియల్ మూవీగా లెజెండ్ సినిమాని నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఓ వైపు గ్రాండ్ గా ఊర్వశీ రౌతేలా లాంటి స్టార్ హీరోయిన్ తో రొమాన్స్, మరో వైపు భీభత్సమైన యాక్షన్ సన్నివేశాలతో కుమ్మేసాడు. తాజాగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకి ఊహించిన దానికంటే ఎక్కువగా రెస్పాన్స్ వస్తుంది. దానికి కారణం సినిమా కంటెంట్ స్ట్రాంగ్ గా ఉందనో, మేకింగ్ అదిరిపోయింది అనో కాదు. సినిమాలో భీభత్సమైన హీరో శరవణన్ పెర్ఫార్మెన్స్ చూడటానికి. సినిమాలో హీరో కనిపించిన ప్రతి సన్నివేశంలో ప్రేక్షకులు నవ్వులతో సందడి చేస్తున్నారు.
అతను యాక్షన్ చేసిన, రొమాన్స్ చేసిన ఆడియన్స్ పగలబడి నవ్వడం థియేటర్స్ లో కనిపిస్తుంది. చివరికి హీరో భార్య చనిపోయే సన్నివేశంలో శరవణన్ ఎమోషనల్ యాక్టింగ్ తో నటిస్తూ ఉండే ఆడియన్స్ నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా భారీ బడ్జెట్ తో నిర్మించిన పాన్ ఇండియా కమర్షియల్ యాక్షన్ చిత్రం ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులని మెప్పించడం విశేషం. ఏదైతేనేం తనని తాను సినిమాతో ప్రమోట్ చేసుకోవడంలో ఈ వ్యాపారవేత్త కమ్ హీరో బాగానే సక్సెస్ అయ్యాడని సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తున్న తర్వాత సోషల్ మీడియాలో చర్చించుకోవడం విశేషం.