Bigboss : బిగ్‌బాస్ రియాలిటీ షో.. దీనికున్న క్రేజ్ మరి దేనికి లేదనే చెప్పాలి. 100 రోజుల పాటు సెలక్టెడ్ కంటెస్టెంట్స్ బయటి ప్రపంచంతో ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా ఒక ఇంట్లోనే బంధీగా ఉండిపోవాలి. ఈ రోజుల్లో చిన్న పిల్లలు సైతం స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణం కూడా ఉండట్లేదు. అలాంటిది వీళ్లంతా మొబైల్ లేకుండా 100 రోజుల పాటు ఒకే ఇంట్లో బంధీగా ఉండాలి. ఇక వాళ్ల మధ్య ఉండే ఎమోషన్స్.. ఎలిమినేషన్స్ సమయంలో వెల్లువెత్తే భావోద్వేగం, కోపతాపాలు జనాలకు ఎక్కడలేనంత కిక్ ఇస్తాయి. దీంతో ఈ షో రేటింగ్స్‌లో దూసుకుపోతుంటుంది. ఒక సీజన్ అవగానే నెక్ట్స్ సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు.
ఇప్పుడు తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షో ఐదు సీజన్లు పూర్తి చేసుకుని ఆరో సీజన్‌లోకి అడుగు పెట్టబోతోంది. ఈ క్రమంలోనే కొందరు కంటెస్టెంట్ల పేర్లు ఇప్పటికే బయటకు వచ్చాయి. తాజాగా బిగ్‌బాస్ షోకి సంబంధించిన ప్రోమో షూట్ కూడా పూర్తయిందనే టాక్ బాగా వినిపిస్తోంది. ఏ నిమిషంలోనైనా షో ప్రారంభ తేదీకి సంబంధించిన డేట్స్ కూడా నిర్వాహకులు వెల్లడిస్తారనే టాక్ బలంగానే వినిపిస్తోంది. తాజాగా స్టార్ మా ఒక అప్డేట్ ఇచ్చింది. ఆరో సీజన్‌కు సంబంధించిన లోగోను విడుదల చేసింది. లోగోలో ఎన్నో విశిష్టతలున్నాయని అర్థమవుతోంది. లోగోలో పొందు పర్చిన ఛారలు, లైన్స్, బిగ్ బాస్ ఐ, అన్నీ కూడా వెరైటీగా ప్లాన్ చేశారు.
Bigboss : షో మొదలయ్యాక అవేంటో అందరికీ అర్థమవుతాయి..
లోగోపై స్టార్ మా వివరణ కూడా ఇచ్చింది. ఇందులో ఉన్న రంగురంగుల చారలు.. ఎమోషన్స్‌ను సూచిస్తాయని, షో మొదలయ్యాక అవేంటో అందరికీ అర్థమవుతాయని తెలిపింది. ఇక ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్లకు సంబంధించి కొన్ని పేర్లు వైరల్ అవుతున్నాయి. వారిలో.. యాంకర్ మంజూష, హీరోయిన్ ఆశా శైనీ, హీరో ఆకాష్, ట్రాన్స్‌జెండర్ తన్మయి, యాంకర్ పద్మిని, ఆర్టిస్ట్ సంజనా చౌదరి, యూట్యూబ్ ఆర్టిస్ట్ కుషిత, హీరో భరత్, సీరియల్ యాక్టర్ కౌశిక్, హీరో సుమంత్ అశ్విన్, హీరోయిన్ ప్రీతి ఆష్రానీతో పాటు మరికొంత మంది పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే ఒక సామాన్యుడు సైతం ఉన్నట్టు సమాచారం.