Vasthu Tips: వాస్తు శాస్త్రం ఒక విశ్వసనీయమైన నమ్మకం. అందుకే మనలో చాలా మంది ఎప్పటి నుండో వాస్తును విశ్వసిస్తూ వస్తున్నారు. అయితే వాస్తును పాటించడం వల్ల మనం మంచి జరిగేలా చూసుకోవచ్చని పెద్దలు సూచిస్తున్నారు. అదే విధంగా కొన్ని విషయాల్లో వాస్తు ప్రకారం తప్పులు చేస్తే అవి నెగెటివ్ ఫలితాలు ఇస్తాయని అంటున్నారు. అయితే ఎలాంటి విషయాల్లో ఏమి పాటించాలో.. ఇక్కడ మీకోసం.
వీటితో మంచి ఫలితం..
ఎవరైనా స్థలం కొనాలని అనుకున్నప్పుడు వాస్తు ప్రకారం జాగ్రత్త పడాలి. స్థలాన్ని కొనుగోలు చేసే ముందు యజమాని మరియు యజమాని ఇంట్లో వాళ్ళ, భార్య పిల్లల పేర్లు, వారికి కలిసి వచ్చే దిశ ను గుర్తించి, దానికి అనుగుణమైన విధంగా స్థలాన్ని కొనడం వల్ల మంచి జరుగుతుంది. స్థలం కొన్న తర్వాత ఇంటిని నిర్మించే క్రమంలో చాలా జాగ్రత్తలు పాటించాలి.
ఇక ఇంటి నిర్మాణంలో బాత్రూమ్ ఎక్కడ ఉండాలి, తలుపులు ఎన్ని ఉండాలి, ఎక్కడెక్కడ ఉండాలి అన్న విషయాలను చాలా జాగ్రత్తగా వాస్తు నిపుణుల సూచనల మేరకు నిర్ణయించాలి. నిర్మాణ దశలో ఉన్న ఇంటిని కొనుగోలు చేయాల్సి వస్తే.. అక్కడి నుండి అది ఉన్న నిర్మాణ స్థాయిని పరిశీలించి మీకు తగిన విధంగా నిర్మాణం పూర్తి చేయాలి.
మనలో చాలా మంది ముందు ఇంట్లోకి వెళ్లిన తర్వాత తగిన విధంగా మార్చుకోవచ్చు లే అని అనుకుంటారు. కానీ తర్వాత పట్టించుకోరు. దీని వల్ల చేదు ఫలితాలు కలుగుతాయి. ఇక వాస్తు ప్రకారం కట్టించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడం జరుగుతుంది. అది కొన్ని రోజుల్లో ఫలితం ఇవ్వడం ప్రారంభం అవుతుంది. కావున ఇంటి నిర్మాణానికి ముందు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.