Bigboss 6 : తెలుగులో మోస్ట్ సక్సెస్ ఫుల్ రియాలిటీ షోగా ‘బిగ్‌బాస్’ (Bigboss) వెలుగొందుతోంది. ఈ షో కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే 5 సీజన్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకొని ఇప్పుడు ఆరో సీజన్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది ఈ షో. ఇక సీజన్ అనుకున్నప్పటి నుంచే కంటెస్టెంట్స్ లిస్ట్ నుంచి సెట్, హోస్ట్ వరకూ ప్రతి ఒక్కదానిపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ సీజన్ ఎప్పుడు మొదలవుతుందా? అని వీక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 6వ సీజన్‌లోని టాస్కులు, నామినేషన్ అండ్ ఎలిమినేషన్ ప్రోసెస్ ఇంకెలా ఉంటుందా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఈ ఆరవ సీజన్‌ను మరింత జాగ్రత్తగా నిర్వాహకులు డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కంటెస్టెంట్స్‌తో సైతం ముందుగానే గ్రూపుల మాటున దాక్కోకుండా ప్రతి ఒక్కరూ కంటెంట్ ఇవ్వాల్సిందే అన్నట్టుగా అగ్రిమెంట్ చేయించుకుంటున్నట్టు సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఈసారి ఎడతెరిపి లేకుండా వివాదాలుండటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ షోకి కూడా నాగార్జునే హోస్ట్‌గా ఉండబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో కూడా ఇటీవలే విడుదలైంది. బిగ్‌బాస్ సీజన్ 6 సెప్టెంబర్ 4 న గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఇక ‘బిగ్‌బాస్ 6’ ఫైనల్ లిస్ట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేసి క్వారంటైన్‌కు పంపించబోతున్నారని టాక్.
Bigboss 6 : ఒక వారం ముందే క్వారంటైన్‌కు కంటెస్టెంట్స్
బిగ్‌బాస్ షో సెప్టెంబర్ 4న ప్రారంభం కానుంది కాబట్టి దానికి ఒక వారం ముందే కంటెస్టెంట్స్‌ను క్వారంటైన్లో ఉంచిన తర్వాతే హౌస్ లోకి పంపుతారట. దీనిలో భాగంగాఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్ పూర్తైందని టాక్.
బిగ్‌బాస్ 6 కంటెస్టెంట్స్ లిస్ట్
1. ప్రత్యూష 2. గలాటా గీతూ 3. ఉదయభాను 4. ఆర్జే చైతూ 5. అనిల్ రాథోడ్ 6. దీపికా పిల్లి 7. అమర్ దీప్ చౌదరి 8. శ్రీమాన్ 9. నేహా చౌదరి 10. ఆర్జే సూర్య 11. ఆది రెడ్డి 12. నిఖిల్ విజేంద్ర 13. చలాకీ చంటి 14. శ్రీసత్య 15. ఇనయా సుల్తానా 16. పాండు మాస్టర్