బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. బంగారం రేటు భారీగా పెరిగింది. బంగారం కొండెక్కి కుర్చుంది. ఒక్కరోజులోనే పైపైకి కదిలింది. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి రేటు ఏకంగా వేలల్లో పెరిగింది. దీంతో బంగారం, వెండి ప్రియులకు ఇది బ్యాడ్ న్యూస్. రష్యా, ఉక్రెయిన్ ఉద్రిక్త పరిస్థితులు ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో శుక్రవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1370 పైకి కదిలింది. దీంతో పసిడి రేటు రూ. 51,550కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ. 1250 పెరిగింది. దీంతో పసిడి రేటు రూ. 47,250కు చేరింది. బంగారం ధరలు పెరిగితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. వెండి రేటు భారీగా పెరిగింది. రూ.2,700 పెరుగుదలతో రూ. 72,700కు ఎగసింది.