రష్యా -ఉక్రెయిన్ సంక్షోభంతో కొండెక్కిన ధరలు దిగివచ్చాయి. శనివారం ధరలు భారీగా కిందకి దిగివచ్చాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.400 వరకు తగ్గి రూ.46,850కి చేరింది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.440 తగ్గి రూ.51,110కు చేరింది . బంగారంతో పాటు సిల్వర్ రేటు కూడా భారీగా తగ్గింది. కేజీ సిల్వర్ ఏకంగా రూ.2,700 మేరకు తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం సిల్వర్ రేట్లు రూ.70 వేలుగా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా రూ.10 పెరిగి రూ.47,260గా ఉంది. అ 24 క్యారెట్ల బంగారం ధర ఢిల్లీ మార్కెట్లో తగ్గింది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం రూ.440 తగ్గి రూ.51,110 కి చేరింది . సిల్వర్ రేటు ఢిల్లీ మార్కెట్లో భారీగా పెరిగింది. కేజీ సిల్వర్ రూ.4 వేల మేర పెరిగింది. దీంతో ధర రూ.66,000 నుంచి రూ.70 వేలకు పెరిగింది.
చెన్నైలో బంగారం ధరలు భారీగా తగ్గింది. శనివారం ఒక్క రోజు 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1,500 మేర దిగొచ్చింది. దీంతో బంగారం ధర రూ.49,510 నుంచి రూ.48,010కు దిగింది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.1,640 కు పడిపోయింది. ఈ ధర రూ.52,370గా నమోదైంది. బంగారంతో పాటు ఇక్కడ మార్కెట్లో సిల్వర్ ధర కూడా దిగొచ్చింది. చెన్నై మార్కెట్లో సిల్వర్ ధరలు రూ.7,700 కు తగ్గాయి. దీంతో శనివారం సిల్వర్ ధర రూ.72,700 నుంచి రూ.65 వేలకు తగ్గిపోయింది.