బంగారం ప్రేమికులకు శుభవార్త. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్ అని చెప్పాలి. బంగారం రేటు పడిపోయింది. బంగారం ధర కిందకు దిగి వచ్చింది. పసిడి రేటు ఈ మూడు రోజుల్లో భారీగా దిగివచ్చింది. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా ఉంది. సిల్వర్ ధర కూడా దిగి వచ్చింది. దీంతో బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పాలి.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో బంగారం ధర తగ్గింది. మూడు రోజుల్లోనే భారీగా తగ్గింది. రూ.440, రూ.540, రూ.10 చొప్పున తగ్గింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,000 మేర పతనమైందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పసిడి రేటు రూ. 50,560కు తగ్గింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో ఉంది. రూ. 910 దిగొచ్చింది. దీంతో పసిడి రేటు రూ. 46,340కు పడిపోయింది. బంగారం వెండి రేటు బాగా తగ్గింది. రూ.3,700 తగ్గి రూ. 69,000కు పడిపోయింది.