బంగారం ప్రియులకు శుభవార్త. ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం మొదలైన తర్వాత కాస్త దిగివచ్చాయి బంగారం, వెండి ధరలు.. గత 4-5 రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి, వెండి ధరలు.. శుక్రవారం మాత్రం కాస్త దిగొచ్చాయి. 10 గ్రాముల బంగారం ధర 400 వరకు తగ్గింది. మరోవైపు వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగాయి. కిలో వెండి ధరపై రూ.100కు పెరిగింది.
ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర భారత మార్కెట్లో రూ.47,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600 ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600గా ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.47,300.. 24 క్యారెట్ల ధర రూ.51,600గా ఉంది. ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.47,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,600 వద్ద ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,300గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ.72,500, విజయవాడలో రూ.72,500, విశాఖపట్నంలో రూ.72,500లు ఉంది.