పసిడి ధర స్వల్పంగా తగ్గింది. బంగారం ధర కొద్దిగా తగ్గితే.. వెండి రేటు మాత్రం అదే రేటు లో కొనసాగుతోంది. సిల్వర్ రేటులో ఈరోజు ఎలాంటి మార్పు లేదు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు చెరొక నడిచాయి. పసిడి రేటు పైపైకి కదిలితే.. వెండి రేటు మాత్రం కింద చూపులు చూసింది. సిల్వర్ రేటు పడిపోయింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో సోమవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కేవలం రూ.10 క్షీణించింది. దీంతో పసిడి రేటు రూ. 50,180కు తగ్గింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.10 తగ్గింది. దీంతో పసిడి రేటు రూ. 45,990కు క్షీణించింది. బంగారం ధరలు స్వల్పంగా తగ్గితే.. వెండి రేటు కూడా నిలకడగానే కొనసాగింది. వెండి రేటులో ఎలాంటి మార్పు లేదు. దీంతో కేజీ వెండి ధర రూ.70,000 వద్దనే ఉంది.