సీఎం జగన్ నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ‘జగనన్నకు చెబుదాం’ అనే ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ఈ కార్యక్రమం లక్ష్యం అని ప్రభుత్వం ప్రకటించింది.
1902 అనే టోల్‌ఫ్రీ నంబరు ను దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసారు. టోల్‌ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి సమస్య ను వివరిస్తే వాటిని నమోదు చేసుకొని తక్షణ పరిష్కారం అందిస్తారు. మరియు వాటి యొక్క పరిష్కార క్రమాన్ని సంక్షేమ కార్యక్రమాలు ఫిర్యాదుదారుడికి ఎప్పటికప్పుడు తెలియజేస్తారు. ప్రభుత్వ సేవలు కానీ ప్రభుత్వ ఉద్యోగుల నుండి గాని ఏదైనా సమస్య తలెత్తితే వాటిని పరీక్షించడమే ముఖ్య ఉద్దేశంగా ‘జగనన్నకు చెబుదాం’ అనే కార్యక్రమాన్ని ఆరంబించారని వైసిపి ప్రభుత్వం పేర్కొంది.
ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు, రేషన్ కార్డు, వైఎస్సార్ పెన్షన్ వంటి విషయాల్లో ఏమైనా సమస్యలు ఎదురైతే 1902 టోల్‌ఫ్రీ నంబరు కు కాల్ చేయవచ్చు. ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన ‘జగనన్నకు చెబుదాం’ అనే టోల్‌ఫ్రీ నంబరు ను వెంటనే డయల్ చేయండి.
