Tollywood: టాలీవుడ్ నుంచి దేశ వ్యాప్తంగా చేరువ అయ్యే పాన్ ఇండియా సినిమాల జోరు ప్రతి ఏడాది పెరుగుతూ వెళ్తుంది. ఒకప్పుడు కమర్షియల్ రొటీన్ కథలతో ప్రేక్షకులని విసిగించిన మన దర్శకులు ఇప్పుడు యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథలపై దృష్టి పెట్టి దేశ వ్యాప్తంగా మెజారిటీ ప్రేక్షకులకి రీచ్ అయ్యే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బాహుబలి తర్వాత ఈ ట్రెండ్ మారిందని చెప్పాలి. యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథ అయితే క్యాస్టింగ్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని కాంతారా, కార్తికేయ 2 సినిమాలు ప్రూవ్ చేశాయి. అలాగే కథలో దమ్ము లేకపోతే స్టార్ హీరోల చిత్రాలైన ప్రేక్షకులకి చేరువ కావని రాదేశ్యామ్ ప్రూవ్ చేసింది.
అయితే మన దర్శకులు మాత్రం తమ టాలెంట్ ని బయటకి తీసి యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథలతో హీరోలని ఒప్పించి, ప్రేక్షకులని మెప్పించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ నేపధ్యంలో ఈ ఏడాది పాన్ ఇండియా కథల జోరు టాలీవుడ్ లో పెరిగింది అని చెప్పాలి. ఈ ఏడాది రాబోయే టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలు చూసుకుంటే నాని దసరా ముందు ఉంది. మార్చి 30న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. తరువాత రవితేజ రావణాసుర మూవీ ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతుంది. పాన్ ఇండియా రేంజ్ లోనే దీనిని రిలీజ్ చేస్తున్నారు.

తరువాత సమంత శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతుంది. ఏప్రిల్ 28న అఖిల్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వస్తున్న ఏజెంట్ మూవీ పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అవుతుంది. మే 5న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా పాన్ ఇండియా రిలీజ్ గా ఉంది. జూన్ 16న ప్రభాస్, ఓం రౌత్ ఆదిపురుష్ రిలీజ్ కి రెడీ అవుతుంది. రామ్ చరణ్, శంకర్ మూవీ జులై 28న రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ఆగష్టు 10న రిలీజ్ అవుతుంది. సెప్టెంబర్ 28న ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్నా సలార్ రిలీజ్ అవుతుంది. `తరువాత ఈ ఏడాది ఆఖరులో సమంత, విజయ్ దేవరకొండ ఖుషి మూవీ రిలీజ్ అవుతుంది. ఇవన్ని పాన్ ఇండియా రేంజ్ లో టాలీవుడ్ నుంచి రిలీజ్ కాబోయే డిఫరెంట్ జోనర్ సినిమాలు కావడం విశేషం.