Tollywood: టాలీవుడ్ తాజాగా కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా తెరకెక్కిన సార్ మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. వెంకి అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. విద్యావ్యవస్థలో కార్పోరేట్ పెత్తనంపై ఆయన ఈ సినిమాలో విమర్శనాత్మకంగా సందేశాన్ని చెప్పారు. ఇక ధనుష్ ఈ సినిమాతో తన అద్బుతమైన పెర్ఫార్మెన్స్ తో మెప్పించారు. ఇక సినిమాకి తెలుగు, తమిళ భాషలలో పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా పుంజుకున్నాయి.
ఇక తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకి థియేటర్స్ సంఖ్య కూడా పెంచడం విశేషం. తెలుగులో స్ట్రైట్ సినిమా చేసిన ధనుష్ బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నాడనే మాట వినిపిస్తుంది. ఇక ఈ మూవీ ఇప్పటివరకు తెలుగులో 10 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఇదిలా ఉంటే మరో వైపు కిరణ్ అబ్బవరం హీరోగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో తెరకెక్కిన చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ. ఈ మూవీ కూడా శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. డీసెంట్ మూవీగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో మూవీ ప్రేక్షకులని మెప్పిస్తుంది.
ఈ నేపధ్యంలో సినిమాకి మొదటి రోజు ఏకంగా 2.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయినట్లు తెలుస్తుంది. ఓ విధంగా చెప్పాలంటే కిరణ్ అబ్బవరం సినిమాకి ఇవి డీసెంట్ కలెక్షన్స్ అని చెప్పాలి. ఇక ఎలాగూ హిట్ టాక్ వచ్చింది. దానికి తోడు టికెట్ ధరలు కూడా అందుబాటులోనే ఉండటంతో కచ్చితంగా ఈ మూవీ మంచి ప్రాఫిట్ తీసుకొస్తుంది అని బన్నీ వాస్ భావిస్తున్నారు. ఓవరాల్ గా ఈ శివరాత్రి సందర్భంగా వచ్చిన రెండు సినిమాలు ప్రేక్షకులకి భాగా కనెక్ట్ అయ్యి పాజిటివ్ బజ్ తో దూసుకుపోతున్నట్లుగా తెలుస్తుంది. మరి లాంగ్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్స్ చేస్తాయి అనేది వేచి చూడాలి.