టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా ఉన్నవారు ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్స్ గా మారిపోయారు. వీరు ఒక్కో సినిమా బడ్జెట్ వంద కోట్లు దాటిపోతుంది. కొంత మంది రెమ్యునరేషన్ కూడా వంద కోట్ల వరకు తీసుకుంటున్నారు. ఇలా వంద కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్స్ లో ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు ఉన్నట్లు తెలుస్తుంది. మహేష్ బాబు అయితే రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా కూడా తీసుకుంటారు. ఈ లెక్కన ఆయనకి ఇంకా ఎక్కువ వస్తుంది. ఏది ఏమైనా పాన్ ఇండియా బ్రాండింగ్ ని టాలీవుడ్ టైర్ 1 హీరోలు అందరూ ఇప్పటికే సంపాదించారు అని చెప్పాలి. ఇక టైర్ 2 హీరోలుగా ఉన్నవారు సినిమా సక్సెస్ ల కోసం కుస్తీలు పడుతున్నారు. ఒక సినిమా హిట్ అయితే రెండు సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి.
రెగ్యులర్ స్టోరీస్ తో సినిమాలు చేస్తూ ఉండటం వలన ఆడియన్స్ వాటిని చూడలేకపోతున్నారు. ఒటీటీ కూడా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకుల టేస్ట్ మారిపోయింది. కథలో కొత్తదనం, థ్రిల్లింగ్ అంశాలు, ఎల్దంటే విజిల్స్ వేసే గూస్ బాంబ్స్ సన్నివేశాలు అలాగే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే స్టొరీ లైన్ ఉండాలని భావిస్తున్నారు. మూస ధోరణిలో తిప్పితిప్పి చూపించే కథలని చూడటానికి ఇష్టపడటం లేదు. ఈ నేపధ్యంలో ఇప్పుడు మన యువ స్టార్స్ అయిన నాని, నితిన్, అఖిల్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, గోపీచంద్, రామ్ పోతినేని లాంటి టైర్ 2 హీరోలు అందరూ కూడా తమ ఇమేజ్ ని, మార్కెట్ రేంజ్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో ఇన్నిరోజులు వెళ్ళిన రొటీన్ కమర్షియల్ దారిలో కాకుండా కొత్తదనం ఉన్న కథల వైపు దృష్టి పెడుతున్నారు. ఈ నేపధ్యంలోనే నాని దసరాతో రాబోతున్నారు. అలాగే అఖిల్ ఏజెంట్ గా అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఇక నాగ చైతన్య కస్టడీ అంటూ కొత్తగా ట్రై చేస్తున్నాడు. వరుణ్ తేజ్ కూడా గాండీవదారి అర్జున్ అంటూ యాక్షన్ లో మెరవబోతున్నాడు. రామ్ బోయపాటి శ్రీనుతో పాన్ ఇండియా మాస్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ విరూపాక్షతో థ్రిల్లర్ కంటెంట్ ట్రై చేస్తున్నాడు. ఇలా టైర్ 2 హీరోలు అందరూ కూడా కొత్తదనం ఉన్న కథలతో ప్రయోగాలు చేస్తున్నారు. మరి వారికి ఇవి ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయనేది చూడాలి.