Bigboss 6 : తెలుగు బుల్లితెరపై సంచలనాలకు కేరాఫ్‌గా నిలిస్తూ.. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో అలరిస్తున్న రియాలిటీ షో బిగ్‌బాస్. ఇటీవలే ఈ షోకు సంబంధించిన లోగో కూడా విడుదలైంది. ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను దక్కించుకుంటూ దూసుకెళుతోంది. ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఆరవ సీజన్లోకి అడుగుపెట్టబోతోంది. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరవ సీజన్ అనుకున్నప్పటి నుంచే దీనికి సంబంధించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. రోజుకో కంటెస్టెంట్ పేరు బయటకు వస్తోంది. తాజాగా అయితే ఏకంగా లిస్టే బయటకు వచ్చింది.
ఇక, ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి తరచూ ఏదో ఒక వార్త వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు లీక్ అవుతున్నాయి. తాజాగా ఆరో సీజన్లో పాల్గొనే మరో సెలెబ్రిటీ వివరాలు బయటకొచ్చాయి. ఈ షోలో ముగ్గురు హీరోలు, ఇద్దరు హీరోయిన్లతో పాటు తెలుగు యాంకర్స్.. అలాగే ఒక సామాన్యుడు కూడా సందడి చేయవచ్చట. అలాగే ఈ సారి ఒక ట్రాన్స్‌జెండర్‌ను కూడా బిగ్‌బాస్ నిర్వాహకులు తీసుకున్నారని టాక్. వచ్చే నెలలోనే మొదలు కాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్ కోసం నిర్వహకులు ఎప్పుడో గ్రౌండ్ వర్క్‌ను ప్రారంభించేశారు. ఇందులో భాగంగానే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియలో ఒక రౌండ్‌ను కూడా పూర్తి చేసి షార్ట్ లిస్టును బిగ్ బాస్ టీమ్ రెడీ చేసింది. ఇప్పుడు వాళ్లతో రెమ్యూనరేషన్ డీల్స్ చేసుకుంటున్నారు.
Bigboss 6 : తరువాత ట్రాన్స్‌జెండర్‌గా మారినట్టు ప్రకటన
గత రెండు మూడు సీజన్లుగా ట్రాన్స్జెండర్లు సైతం షోలో పాల్గొంటూ వస్తున్నారు. ఇక ఈ సీజన్లోనూ ట్రాన్స్‌జెండర్ ఉండబోతోందని టాక్. ఆమె ఎవరో కాదు.. ఆరో సీజన్లో జబర్ధస్త్ ఫేమ్ ప్రముఖ ట్రాన్స్‌జెండర్ తన్మయి పాల్గొనబోతున్నట్లు సమాచారం. దీంతో ఆమె పేరు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. మరి తన్మయికి అవకావం ఎలా వచ్చింది? అంటే.. జబర్ధస్త్‌లో లేడీ గెటప్‌లు వేసుకుంటూ ఆమె చాలా ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత ట్రాన్స్‌జెండర్‌గా మారినట్లు ప్రముఖ షోలో ప్రకటించింది. అయితే గత రెండు సీజన్ల మాదిరిగానే ఈ సీజన్లోనూ ఒక ట్రాన్స్‌జెండర్‌ను తీసుకోవాలని భావించిన నిర్వాహకులకు తన్మయి స్టార్ మాలోనే దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఆమె స్టార్ మాలోనే కామెడీ షోలలో అలరిస్తోంది. దీంతో బిగ్‌బాస్ నిర్వాహకులు ఆమెను సంప్రదించినట్టు సమాచారం.