తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటి వరకు ఐదు సీజన్స్‌ను కంప్లీట్ చేసుకుంది. ఈ రియాలిటీ షో ద్వారా చాలా మంది తెలుగు ఆడియెన్స్‌కు దగ్గరయ్యారు. ఇప్పటి ట్రెండ్‌కు తగినట్లుగా ఉండే ఈ బిగ్ బాస్ షోను సీపీఐ నేత నారాయణ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. పలు సందర్భాల్లో ఆయన ఈ బిగ్ బాస్ షోను ఉద్దేశించి, నాగార్జునపైన తీవ్రంగా విరుచుకు పడ్డారు. రీసెంట్‌గా బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. బిగ్ బాస్ అనేది లైసెన్స్ తీసుకున్న బ్రోతల్ హౌస్ అంటూ కామెంట్ చేశారు.
సీపీఐ నేత నారాయణ బిగ్ బాస్ హౌస్ చేసిన పరుష వ్యాఖ్యలపై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి స్పందిచారు. ఓ టీవీ షో డిబేట్‌లో పాల్గొన్న తమన్నా సింహాద్రి.. బిగ్ బాస్ హౌస్‌ను బ్రోతల్ హౌస్ అన్నందుకు నారాయణను చెప్పుతో కొట్టాలన్నారు. బిగ్ బాస్ షో వల్ల చాలా మందికి ఉపాధి దొరుకుతుందని అన్నారు. ఒకవేళ షో నచ్చకపోతే ఛానెల్ మార్చుకోవాలనే తప్ప ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కౌంటర్ ఇచ్చారు తమన్నా.
శనివారం నుంచి ఈ బిగ్‌బాస్ ఇరవై నాలుగు గంటల ఎంటర్‌టైన్మెంట్‌ను అందిస్తుంది. డిస్నీ హాట్ స్టార్ ఓటటీలో బిగ్ బాస్ ఓటిటి ప్రారంభమైంది. ఈ సారి 17 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. వారిలో బిందు మాధవి, అఖిల్ సార్థక్, ఆర్‌జె చైతు, యాంకర్ శివ, ముమైత్ ఖాన్, అనిల్ రాథోడ్, మిత్ర శర్మ, అజయ్, బబ్లూ, యాంకర్ స్రవంతి, మహేష్ విట్టా, అరియానా గ్లోరి, హమీదా, సరయు, ఆషు రెడ్డి ఉన్నారు. సరికొత్తగా ప్రారంభమైన ఈ బిగ్ బాస్ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకోబోతుందో చూడాలి మరి.