Trisha Krishnan : మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ హిట్ తో త్రిష ఫామ్ లోకి వచ్చింది. ఇన్నాళ్లు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసిన ఈ బ్యూటీ మళ్లీ హీరో తో రొమాన్స్ చేసేందుకు సిద్దమయ్యింది. తమిళ సూపర్ స్టార్ విజయ్ తలపతి తో ఐదో సారి జోడి కట్టి అభిమానులను ఖుషి చేయబోతోంది ఈ బ్యూటీ.

సౌత్ స్టార్ హీరో విజయ్ తలపతి రాబోయే తమిళ చిత్రం తలపతి 67 పూజా కార్యక్రమాలను మేకర్స్ చిత్ర షూటింగ్‌కు ముందు నిర్వహించారు. తాజాగా ఈ సినిమాలోని నటీనటుల తుది జాబితాను టీం వెల్లడించింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా లో కాస్టింగ్, టెక్నికల్ స్టాండర్డ్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగ ఉండనున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్ మిస్కిన్ తదితరులు ఈ మూవీ లో ఆక్ట్ చేయనున్నట్లు తెలిసింది. తాజాగా పొన్నియిన్ సెల్వన్ బ్యూటీ త్రిష కృష్ణన్ తలపతి 67లో చేరింది.

ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుంది. విజయ్‌తో త్రిషకు ఇది ఐదవ సినిమా. ఈ మ్యాజికల్ పెయిర్ 14 ఏళ్ల తర్వాత కలిసి పని చేయనున్నారు. తాజాగా మూవీ యూనిట్ నిర్వహించిన పూజా కార్యక్రమం లో త్రిష పాలుపంచుకుంది. లేత గోధుమరంగు రంగు చీరను ధరించి అందరి చూపును తనవైపుకు తిప్పుకుంది. వీరితో పాటు, తళపతి 67లో భాగమైన నటులు అర్జున్ సర్జా, మన్సూర్ అలీ ఖాన్ , ప్రియా ఆనంద్ లు కూడా ఈ కార్యక్రమంలో భాగమయ్యారు.

ఈ సినిమా తొలి షెడ్యూల్ కాశ్మీర్‌లో జరగనుంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన మాస్టర్ తర్వాత డైరెక్టర్ హీరో కాంబినేషన్ లో వచ్చే రెండో సినిమా ఇది. చాలా కాలం తర్వాత త్రిష కృష్ణన్ ,విజయ్ కలిసి కనిపించిన కొత్త వీడియోను చిత్ర బృందం సోషల్ మీడియా లో విడుదల చేసింది. వీరిద్దరూ గతంలో గిల్లి, తిరుపాచి వంటి చిత్రాల్లో కలిసి నటించారు.

తళపతి 67 గ్యాంగ్‌స్టర్ చిత్రమని దర్శకుడు లోకేష్ ఇదివరకే తెలిపారు. ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడే చెప్పలేను.. కానీ ఇది మిగితా సినిమాలకు భిన్నంగా ఉంటుంది అని అన్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరింత సమాచారం విడుదల తర్వాత మాత్రమే పంచుకుంటాను అని అన్నారు.