తన అభిమాన హీరోకి తనను దూరం చేశాడనే కారణమో లేక మరేదైనా రీజనో తెలియదు కానీ..స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌పై బండ్ల గణేష్ తనదైన స్టైల్లో సెటైరికల్ ట్వీట్స్ వేస్తున్నారు. అయితే అది డైరెక్ట్‌గా కాదు ఇన్ డైరెక్ట్‌గా. ఎక్కడా త్రివిక్రమ్ పేరుని నేరుగా ప్రస్తావించకుండా గురూజీ అని సంబోధిస్తూ ట్వీట్స్ వర్షం కురిపిస్తున్నాడుబండ్ల గణేష్.
త్రివిక్రమ్‌ను ఇండస్ట్రీలో గురూజీ అని సంబోధిస్తుంటారు. ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే బండ్ల గణేష్‌తో ఓ నెటిజన్ తను ప్రొడ్యూసర్ కావాలనుకుంటున్నానని కోరికను వ్యక్తం చేశాడు. దానికి ఆయన రియాక్ట్ అవుతూ ‘గురూజీని కలిసి కాస్ట్‌లీ గిఫ్ట్ ఇవ్వు. నువ్వు అనుకున్నది అయిపోతుంది’ అంటూ సెటైరికల్ ట్వీట్ వేశాడు. అక్కడ నుంచి వరుస ట్వీట్స్ వేశాడు. ఇవన్నీ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.
గురూజీకి కనుక కథ చెబితే.. స్క్రీన్ ప్లే రాసి.. దానికి తగ్గట్టు మళ్లీ కథను అంతా మార్చి.. ఇక అసలు అనుకున్న కథను షెడ్డుకు పంపిస్తాడట కదా? అని అడిగాడు ఓ నెటిజన్.ఇక దానికి బండ్ల గణేష్ ఇలా సమాధానం ఇచ్చాడు. అదే కాదు భార్యాభర్తల్ని, తండ్రి కొడుకుల్ని గురుశిష్యుల్ని ఎవర్నైనా వేరు చేస్తాడు అది మన గురూజీ స్పెషాలిటీ అంటూ బండ్ల గణేష్ త్రివిక్రమ్ పై కౌంటర్లు వేశాడు.
దీంతో పవన్ కళ్యాణ్ రేణూ దేశాయ్ విడాకుల వ్యవహారం వెనుక కూడా త్రివిక్రమ్ ఉన్నాడా? అనే టాక్ మొదలైంది. అది ప్రక్కన పెడితే..ఎందుకు మళ్లీ బండ్లన్న ..హఠాత్తుగా త్రివిక్రమ్ ని తగులుకున్నాడు..మళ్లీ ఏదన్నా తెరవెనక వీరి మధ్య ఏదైనా జరిగిందా అనే విషయమై సినీ జనం ఆచూకీ తీస్తున్నారు.
ఇలా త్రివిక్రమ్‌ను పేరు చెప్పకుండా గురూజీ అని బండ్ల గణేష్ ఇది వరకే చాలా ట్వీట్స్ వేశారు. అందుకు కారణం భీమ్లా నాయక్ ముందు వరకు పవన్‌తో సన్నిహితంగా ఉంటూనే వచ్చిన బండ్ల గణేష్‌ను భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ సమయానికంతా త్రివిక్రమ్ కావాలనే పక్కకు పెట్టించారనే వార్తలు వచ్చాయి. అదే సమయంలో త్రివిక్రమ్‌ను తిడుతున్న బండ్ల గణేష్ ఆడియో ఒకటి నెట్టింట వైరల్ కావటంతో పవన్ క్యాంప్‌కి బండ్ల దూరమయ్యాడంటూ వార్తలు వచ్చేశాయి.