Turkey syria Earth Quake : టర్కీ , సిరియాలో సంభవించిన వినాశకరమైన భూకంపంలో మరణించిన వారి సంఖ్య 7,800 దాటింది. భూకంతో చెల్లాచెదురైన భవాల శిథిలాల కింది చిక్కుక్కున్న వారిని సజీవంగా తీసుకువచ్చేందుకు సెర్చ్ టీమ్స్ తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఇప్పటే ప్రాణాలతో బయటపడిన, గాయపడిన వారికి సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. భారతదేశంతో సహా అనేక దేశాల నుండి అంతర్జాతీయ సహాయం అందుతున్నప్పటికీ, గడ్డకట్టే వాతావరణం , భూ ప్రకంపనల మధ్య సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతోంది.

ఆగ్నేయ టర్కీ , ఉత్తర సిరియాలో సోమవారం 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 5,400 దాటిందని, 31,000 మంది గాయపడ్డారని టర్కీ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ తెలిపింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, సిరియాలోని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో మరణించిన వారి సంఖ్య 800కి పైగా పెరిగింది, దాదాపు 1,500 మంది గాయపడ్డారని తెలుస్తోంది.
టర్కీ-సిరియాకు చైనా మద్దతుగా నిలుస్తోంది. టర్కీకి అత్యవసర సహాయంగా మొదటి విడతగా 40 మిలియన్ యువాన్లు ఇవ్వాలని చైనా ఇప్పటికే కట్టుబడి ఉంది. దాదాపు 30 దేశాల నుండి శోధన బృందాలు, సహాయ సహకారాలు అందిస్తున్నాయి. కానీ అనేక నగరాలు, పట్టణాలలో అధికమొత్తంలో నష్టం ఏర్పడటంతో కొన్న ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్లకు ఆటంకం ఏర్పడుతోంది. శిథిలాల గుట్టల నుండి సహాయం కోసం ఏడుస్తున్న గొంతులు నిశ్శబ్దం అయ్యాయి. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ భారీ భూకంపాలతో దెబ్బతిన్న 10 దక్షిణ ప్రావిన్సులలో మూడు నెలల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించారని, అనడోలు ఏజెన్సీ నివేదించింది.

భూకంపం సంభవించిన సిరియన్ పట్టణంలో శిథిలాల కింద ప్రసవిస్తూ తల్లి చనిపోయి తన శిశువుకు ప్రాణం పోసింది. భూకంపంలో దెబ్బతిన్న సిరియన్ పట్టణంలో, శిథిలాలను తవ్వుతున్న నివాసితులు ఏడుస్తున్న శిశువును కనుగొన్నారు.

నవజాత బాలిక బొడ్డు తాడు ఇప్పటికీ చనిపోయిన ఆమె తల్లి అఫ్రా అబు హదియాతో అనుసంధానించబడిఉందని అక్కడి వారు తెలిపారు. కుప్ప కూలిన బవనం నుండి ఆమె కుటుంబంలో పాప ఒక్కతే ప్రాణాలతో బయటపడిందని తెలుస్తోంది..