బిగ్ బాస్ రియాలిటీ షో ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. మొదటి ఇంగ్లీష్ లో మొదలైన ఈ షో తరువాత హిందీలోకి అడుగుపెట్టింది. సల్మాన్ ఖాన్ సారధ్యంలో బిగ్ బాస్ షో హిందీలో మొదలై మంచి సక్సెస్ అయ్యింది. ఇప్పటికే చాలా సీజన్స్ హిందీ బిగ్ బాస్ పూర్తి చేసుకుంది. ఇక అక్కడ ఈ రియాలిటీ షోకి మంచి రేటింగ్స్ రావడంతో ప్రాంతీయ బాషలలో కూడా దీనిని మొదలు పెట్టారు. తెలుగులో మొదటి సీజన్ ఎన్టీఆర్ వ్యాఖ్యతగా మొదలైంది. తరువాత సీజన్ 2 నాని యాంకర్ గా నడిచింది. ఆ తరువాత నుంచి కింగ్ నాగార్జున బిగ్ బాస్ బాధ్యతలని తీసుకున్నారు. ఇప్పటికి నాగార్జున మూడు సీజన్ లకి వ్యాఖ్యతగా వ్యవహరించారు.
త్వరలో ఆరో సీజన్ కి రంగం సిద్ధం అవుతుంది. దీనికి సంబంధించిన పార్టిసిపెంట్ ల గురించి చాలా రోజులుగా చర్చ నడుస్తుంది. గత మూడు సీజన్ లలో సినీ సెలబ్రిటీలతో పాటు సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వారిని కూడా ఈ షో కోసం తీసుకొస్తున్నారు. వివిధ రంగాలలో రాణిస్తున్న వారిని బిగ్ బాస్ షో కోసం ఎంపిక చేసి హౌస్ లోకి తీసుకొస్తున్నారు. ఈ షో ద్వారా కొంత మంది తమ ఫేం పెంచుకుంటే మరికొంత మంది ఫేమ్ ఊహించని విధంగా డ్యామేజ్ అయ్యింది. అయితే కెరియర్ పరంగా బిగ్ బాస్ షో ఎవరికీ పెద్దగా కలిసిరాలేదు అనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అయిన కాని చాలా మంది సోషల్ మీడియా సెలబ్రిటీలు బిగ్ బాస్ షో లో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక షోకి హైప్ తీసుకురావడం కోసం కాస్తా ఫేం ఉన్న వారిని ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి నిర్వాహకులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఒకప్పటి స్టార్ యాంకర్ ఉదయభానుని బిగ్ బాస్ కోసం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆమె మాత్రం పాల్గొనడానికి ఆసక్తి చూపించలేదు. అయితే సీజన్ 6 కోసం ఆమెకి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. చాలా గ్యాప్ తర్వాత మరల యాంకర్ గా బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తున్న ఉదయభాను కూడా ఈ సారి రెమ్యునరేషన్ ఎక్కువగా ఆఫర్ చేయడంతో పాల్గొనడానికి ఆసక్తిగానే ఉందనే మాట వినిపిస్తుంది. మరి అది ఎంత వరకు నిజం అవుతుంది అనేది వేచి చూడాలి.