నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీలో చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 షో కి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే సీజన్ 2 లో భాగంగా చంద్రబాబు నాయుడు షోలో బాలకృష్ణ ఆసక్తికరమైన విషయాలు అడిగి తెలుసుకున్నారు. అదే టైంలో కావలసినంత ఎంటర్టైన్మెంట్ ను కూడా ఇచ్చారు. ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని కూడా బాలకృష్ణ ఇంటర్వ్యూ చేయడం విశేషం. ఇదిలా ఉంటే డిజిటల్ హిస్టరీలోనే మొదటిసారిగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువమంది ఎదురుచూస్తున్న ఎపిసోడ్ పవన్ కళ్యాణ్, బాలకృష్ణ కాంబోలో రాబోతుంది. అసలు పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూలకు రావడం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటిది మొదటిసారి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ కి వచ్చి సందడి చేశారు.
తాజాగా ఎపిసోడ్ సంబంధించి టీజర్ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ టీజర్ లో బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ని రాజకీయాల గురించి ఆసక్తికరమైన ప్రశ్నలు వేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా వైసిపిపై పవన్ కళ్యాణ్ చేసే విమర్శలపై బాలకృష్ణ తనదైన శైలిలో అడిగారు. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ నేనెవర్ని ఒక్క మాట కూడా అనలేను అంటూ కాస్త ఫన్నీగా చెప్పారు. దీనిపై ఆడియన్స్ అందరూ కూడా గట్టిగా కేకలు వేయడం విశేషం. తర్వాత గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎందుకు ఓట్లుగా మలుచుకోలేకపోయారు అనే ప్రశ్న బాలకృష్ణ వేశారు.
అయితే దీనిపై పవన్ కళ్యాణ్ ఎలాంటి సమాధానం చెప్పాడు అనేది సస్పెన్స్ గా టీజర్ లో విడిచిపెట్టారు. అయితే బాలకృష్ణ పవన్ కళ్యాణ్ మధ్య సంభాషణ మాత్రం చాలా జోబియల్ గా నడిచినట్లు ఈ టీజర్ బట్టి తెలుస్తుంది. అలాగే రాజకీయాల గురించి కూడా పవన్ కళ్యాణ్ చాలా చాలా జోయాలుగానే సమాధానం చెప్పినట్లు టీజర్ బట్టి అర్థమవుతుంది. అయితే టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై వైసిపి సోషల్ మీడియా టీం ఎలా రియాక్ట్ అవుతుంది. నాయకులు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది.