Upasana Konidela : బాలీవుడ్ కొత్త జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాలకు రామ్ చరణ్ భార్య ఉపాసన క్షమాపణలు చెప్పింది. పెళ్లికి రాలేకపోయినందుకు గాను ఆమె తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కియారా , సిద్ధార్థ్ లకు క్షమాపణలు చెప్పింది. కియారా అద్వానీ , రామ్ చరణ్ లు జోడీగా టాలీవుడ్లో ఓ కొత్త సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ క్రమంలో వెడ్డింగ్‌కు రామ్‌చరణ్, ఉపాసనను కియారా పెయిర్ ఇన్వైట్ చేసింది. అయితే ఈ వేడుకకు హాజరుకాలేకపోయినందుకు ఉపాసన తనవైపు నుంచి సారీ చెప్పింది.

కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా మంగళవారం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో సూర్యగఢ్ ప్యాలెస్‌లో కుటుంబ సభ్యులు, కొంతమంది స్నేహితుల అతికొద్ది మంది సెలబ్రిటీల సమక్షంలో అంగరంగవైభవంగా వివాహం చేసుకున్నారు. అతిథి జాబితాలో కొంతమంది సన్నిహితులు మాత్రమే ఉన్నారు. దర్శకుడు ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న నూతన చిత్రంలో కియారాతో కలిసి రామ్ చరణ్ నటిస్తున్నాడు. దీంతో రామ్ చరణ్, భార్య ఉపాసన కూడా పెళ్లికి ఇన్వైట్ చేసింది ఈ జోడి. అయితే, వారు ఈ వేడుకకు హాజరుకాలేకపోయారు. లేటెస్ట్ గా ఈ జోడీ తమ వెడ్డింగ్ ఆల్బమ్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ క్యూట్ కపుల్ ను చూసి ఉపాసన ఇన్‌బాక్స్‌లో కామెంట్ చేసింది వివాహానికి హాజరు కానందుకు క్షమాపణలు కోరుతూ కొత్త జంటకు అభినందనలు, మీరు చాలా అందంగా ఉన్నారు. క్షమించండి మేము వేడుకలో భాగం కాలేకపోయాము. మీ ఇద్దరికీ లాట్సాఫ్ లవ్ అని వ్రాసింది.

కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా వివాహానికి కియారాతో స్క్రీన్ షేర్ చేసుకున్న నటుడు షాహిద్ కపూర్, పాటు అతని భార్య మీరా రాజ్‌పుత్ కూడా వివాహ వేడుకకు హాజరయ్యారు. ఇక కియారా చిన్ననాటి స్నేహితురాలు ఇషా అంబానీతో పాటు భర్త ఆనంద్ పిరమల్ కూడా వివాహానికి హాజరయ్యారు. కియారా అద్వానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిన జూహీ చావ్లా, భర్త జే మెహతాతో కలిసి పెళ్లికి హాజరయ్యారు. మనీష్ మల్హోత్రా కూడా ఈ వేడుకల్లో పాలుపంచుకున్నాడు. సిద్ధార్థ్ మల్హోత్రా ,కియారాతో కలిసి పలు ప్రాజెక్ట్‌లలో పనిచేసిన కరణ్ జోహార్ కూడా పెళ్లికి హాజరయ్యారు.

బాలీవుడ్ లో 2012 లో రిలీజ్ అయిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సిద్ధార్థ్‌కు పెద్ద బ్రేక్ ను అందించింది. కియారా గుడ్ న్యూజ్, జగ్‌జగ్ జీయోతో సహా ధర్మ ప్రొడక్షన్స్ లో పలు ప్రాజెక్ట్‌లలో నటించింది. 2018 నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ ఫిల్మ్ లస్ట్ స్టోరీస్‌లో కూడా ఇద్దరూ కలిసి పనిచేశారు. సిద్ధార్థ్ ,కియారా 2021లో షేర్షా చిత్రంతో మొదటి సారి జోడీగా స్క్రేన్ మీద కనిపించారు. అప్పటి నుంచి వీరి లవ్ ట్రాక్ ప్రారంభమయ్యిందని టాక్. అలా మొదలైన వారి లవ్ జర్నీ ఇలా పెళ్లితో కంటిన్యూ అవుతోంది.