Urvashi Rautela : వేర్ ఇస్ ది పార్టీ బాసు వేర్ ఇస్ ది పార్టీ అంటూ చిరంజీవితో వాల్తేరు వీరయ్యలో రెచ్చిపోయి మరీ స్పెషల్ సాంగ్‌లో చిందులేసి తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచేసింది బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా. ఈ చిన్నది చేసిన స్పెషల్ సాంగ్ తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్‌లో మోత మోగించింది. వాల్తేరు వీరయ్య చిత్రం కూడా మంచి హిట్ కొట్టడంతో అమ్మడు ఫుల్ ఖుషీ ఖుషీలో ఉంది. ప్రస్తుతం షూటింగ్ కు దూరంగా ఉంటున్న ఊర్వశి రౌటేలా ఖాళీ సమయాన్ని వేస్ట్ చేయకుండా ఫోటో షూట్‌లతో ఫ్యాషన్ ఈవెంట్లతో బిజీ బిజీగా మారింది. తాజాగా ఈ చిన్నది ప్యారిస్ ఫ్యాషన్ వీక్ కోసం లగ్జరీ ఫ్లై ఎక్కి మరీ రయ్యి రయ్యి మంటూ పారిస్ కి వెళ్లింది. అమె టూర్ కు సంబంధించిన విషయాలను తెలియజేస్తూ ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పిక్స్‌ను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మడి లుక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

ఊర్వశి రౌటేలా ఆమె ఫ్యాషన్ వీక్ కోసం పారిస్‌కు బయలుదేరింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస చిత్రాలతో ఈ విషయాన్ని ఈ బ్యూటీనే ప్రకటించింది. ఊర్వశి, అద్భుతమైన తెల్లటి ఆఫ్-షోల్డర్ పొట్టి గౌనును ధరించి ఆమె ప్యారిస్ ట్రావెల్ లుక్‌తో అందరిని ఆకర్షించింది. ఎయిర్‌పోర్ట్‌లోని లాంజ్ ఏరియాలో ఈ పిక్ క్లిక్ చేసినట్లు తెలుస్తోంది.

నటి తన రెండో పిక్ ఆమె విమానంలో ఎక్కిన తరువాత తీసింది. ఈ పిక్‌లో ఆమె అద్భుతమైన బిజినెస్ క్లాస్ అనుభవాన్ని ఆస్వాదిస్తూ కనిపిస్తుంది. తన అవుట్‌ఫిట్ కు సెట్ అయ్యే డిజైనర్ హ్యాండ్‌బ్యాగ్‌ని ధరించి ఫ్యాషన్ ప్రియులకు ఫ్యాషన్ స్టేట్మెంట్స్‌ను అందించింది ఈ చిన్నది. విమానం లోపల ఒక గ్లాసు జ్యూస్ తాగుతూ ఊర్వశి హాయిగా కనిపిస్తోంది.

ఈ పిక్స్‌ను పోస్ట్ చేసి “పారిస్ ఫ్యాషన్ వీక్” అని రాసింది ఊర్వశి. ఆమె పోస్ట్‌కు వైట్ హార్ట్ ఎమోజీని కూడా జోడించింది. అంతేకాదు ప్రత్యేకమైన హ్యాష్‌ట్యాగ్‌లు,జోడించింది. ఈ లుక్‌లో ఊర్శశిని చూసిన అభిమానులు పొగడ్తలతో ఈ ముద్దుగుమ్మను ముంచేశారు. ఫైర్ , రెడ్ హార్ట్ ఎమోజీలను కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేసి తమ అభిమానాన్ని తెలిపారు.