Kantara 2: రిషబ్ శెట్టి దర్శకత్వంలో కన్నడంలో తెరకెక్కి పాన్ ఇండియా లెవల్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మూవీ కాంతారా. ఈ మూవీ కేవలం 15 కోట్ల పెట్టుబడితో తెరకెక్కి ఏకంగా 300 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. రిలీజ్ అయిన అన్ని భాషలలో సూపర్ హిట్ టాక్ తో రికార్డు స్థాయి కలెక్షన్స్ ని కాంతారా మూవీ సొంతం చేసుకోవడం విశేషం. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీకి ప్రీక్వెల్ ని దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబందించిన కథ ఇప్పటికే సిద్ధమైనట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబందించిన క్యాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో రిషబ్ శెట్టి ఉన్నట్లు తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో అన్ని భాషలలో ఒకే సారి ఈ సినిమాని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇతర భాషల నుంచి కూడా కొంత మంది క్యాస్టింగ్ ని ఫైనల్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో తాజాగా ఈ మూవీ కోసం బాలీవుడ్ భామ ఊర్వశీ రౌతేలాని ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేసింట్లు తెలుస్తుంది. తాజాగా ఈ బ్యూటీ బెంగుళూరులో హోంబలే ఫిలిమ్స్ ఆఫీస్ లో ప్రత్యక్షం అయ్యింది.
అక్కడ రిషబ్ శెట్టితో కలిసి దిగిన ఫోటోని ఊర్వశీ షేర్ చేసింది. దీనిని బట్టి కాంతారా 2లో ఆమె ఫైనల్ అయినట్లు కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఊర్వశీ ఎలాంటి పాత్రని సినిమాలో చేయబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక తమిళ్, తెలుగు భాషల నుంచి కూడా కొంత మంది నటులని కాంతారా2 కోసం ఎంపిక చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ మూవీని రిలీజ్ చేస్తానని రిషబ్ శెట్టి ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో త్వరలో మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది.