Vaani Kapoor : మెరుపుల గౌను ధరించి అవార్డుల ఫంక్షన్‌లో తళుక్కుమంది బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్. తన హాట్ లుక్స్‌తో కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ చేసింది ఈ చిన్నది . ఈ బ్యూటీ రీసెంట్‌గా నటించిన మూవీ చండీగఢ్ కరే ఆషిక్ చిత్రానికి అనేక అవార్డులు వచ్చాయి. ఇటీవల జరిగిన అవార్డ్ షోలో ఈ హిందీ సినిమా బిగ్గెస్ట్ డిస్ట్రప్టర్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ సందర్భంగా, వాణి తొడ ఎత్తైన చీలికతో వచ్చిన బ్రౌన్ కలర్ సీక్విన్డ్ గౌను ధరించింది రెడ్ కార్పెట్‌పైన సందడి చేసింది. ఈ అవుట్‌ఫిట్‌లో అందాలను ఆరబోస్తూ అందరి చూపులను తనవైపుకు తిప్పుకుంది.

డీప్ నెక్‌లైన్, ఓపెన్ బ్యాక్, థై హై స్లిట్ తో డిజైన్ చేసిన ఈ అవుట్‌ఫిట్‌తో వాణి కపూర్ అవార్డ్ షోలో అందరి దృష్టిని ఆకర్షించింది. తన అందాలను స్పష్టంగా చూపిస్తూ యూత్‌కు నిద్ర లేకుండా చేస్తోంది. బ్రౌన్ కలర్‌లో సీక్విన్స్ తో వచ్చిన ఈ ఫిగర్ హగ్గింగ్ అవుట్‌ఫిట్ వాణి ఫిగర్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యింది.

ఈ బాడీకాన్ డ్రెస్ అమ్మడి ఒంపుసొంపులు స్పష్టంగా చూపిస్తోంది. ఇక గౌన్‌కు ముందు భాగంలో ఇచ్చిన డీప్ నెక్‌లైన్ వాణి ఎద అందాలను చూపిస్తున్నాయి. ఫ్యాన్స్ చూపులను ఆమె పై నుంచి తిప్పనీయకుండా చేస్తున్నారు. ఈ హాట్ డ్రెస్ తో చేసిన ఫోటో షూట్ పిక్స్ ను వాణి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ అవుట్ ఫిట్‌కు తగ్గట్లుగా వాణి కపూర్ మెడలో ఆకుపచ్చ రాయితో వచ్చిన లాకెట్ ,పొడవాటి చైన్ ను తన మెడలో అలంకరించుకుంది. ఈ చైన్ అందరి దృష్టిని అమితంగా ఆకట్టుకుంది. చెవులకు గోల్డెన్ స్టడ్స్, చేతి వేళ్లకు బంగారు ఉంగరాలను పెట్టుకుంది. పాదాలకు బ్లాక్ కలర్ ఫుట్ వేర్ వేసుకుని తన లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చుకుంది వాణి కపూర్.

రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఎత్నిక్ వేర్ ఫోటో షూట్ పిక్స్ కూడా ఆమె అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. వాణి కపూర్ ఐవరీ చీర కట్టుకుని దానికి జోడీగా స్లీవ్‌లెస్ సీక్విన్స్ బ్లౌజ్ ధరించి దేశీయ వైబ్స్ ను తీసుకువచ్చింది.

ఈ చీరను అతి క్లిష్టమైన డిజైన్స్‌తో డిజైన్ చేశారు డిజైనర్. ప్రముఖ భారతీయ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియాని ఈ చీరను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. అంతే అద్భుతంగా ఈ చీరను సాంప్రదాయంగా కట్టుకుని తన అభిమానులను తన్మయంలో ముంచింది ఈ హాట్ బ్యూటీ.