యంగ్ హీరో నితిన్ మూవీలంటే టాలీవుడ్‌లో ఓ రకమైన క్రేజ్ ఉంటుంది. జయాపజయాలను లెక్కచేయకుండా వరుస సినిమాలకు కమిటవుతూ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తుంటాడు నితిన్. ఈ నేపథ్యంలో నితిన్ హీరోగా రైటర్, దర్శకుడు వక్కంతం వంశీ ఓ సినిమా రూపొందిస్తున్నారని సమాచారం. దీనికి జూనియర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు వంశీ.. ఈ కథను మరింత సానబడుతూ అంతా పక్కా ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం.
గతంలో అల్లు అర్జున్ హీరోగా ‘నా పేరు సూర్య’ సినిమా రూపొందించి ఆశించిన ఫలితం రాబట్టలేదు వక్కంతం వంశీ.. ఆ తరువాత దర్శకుడిగా కాస్త గ్యాప్ తీసుకొని తిరిగి ఇప్పుడు ఓ పవర్‌ఫుల్ కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైపోతున్నారు. ఈ సినిమాలో నితిన్‌ని హీరోగా తీసుకున్నారు.. ఈ కథను ‘పోకిరి’ తరహాలో మలుస్తున్నారని ఇండ్రస్ట్రీ టాక్. దర్శకుడిగా ఎలాగైనా సత్తా చాటి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్టులో ఉండాలని ఫిక్సయిన వక్కంతం వంశీ ఈ సినిమా కోసం చాలా కేర్ తీసుకుంటున్నారని సమాచారం.
ఠాగూర్ మధు నిర్మాణంలో గ్రాండ్‌గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి వీలైనంత త్వరగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారని తెలుస్తుంది. కాగా ఈ మూవీలో నటించబోయే ఇతర నటీనటుల విషయమై ఇప్పటికైతే ఎలాంటి సమాచారం రాలేదు.
ఇకపోతే నితిన్ ప్రస్తుతం ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమా చేస్తున్నాడు. ఆయన సొంత బ్యానర్లో ఈ సినిమా రెడీ అవుతుంది. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా చేస్తుంది. గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ అతి త్వరలో అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. తన ఇష్టసఖి శాలినిని పెళ్లాడాక నితిన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా అయ్యాడు.