Vande Bharat Express : కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ లను ప్రారంభించింది. సుదూర ప్రాంతాలకు త్వరగా చేరుకునేలా ట్రైన్ లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించిన దాదాపు నెల తర్వాత, ప్రస్తుతం సోషల్ మీడియా లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ట్రైన్ లో క్వాలిటీ ఫుడ్ అందడం లేదని ఓ ప్రయాణికుడు షూట్ చేసిన వీడియో ను సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు ప్రస్తుతం నెట్టింట్లో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో క్లిప్ ని వైజాగ్ నుండి హైదరాబాద్ వైపు వెళ్ళే వందే భారత్ రైలులో ప్రయాణించే ఓ పాసెంజర్ చిత్రీకరించాడు.
ఈ క్లిప్‌లో, ప్రయాణీకుడు రైలులో తాను తీసుకున్న వడ నుండి నూనెను పిండడం కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైలులో ఆహార ధర చాలా ఎక్కువ, నాణ్యత చాలా తక్కువ అని పోస్ట్ కు క్యాప్షన్ ను జోడించాడు.
45 సెకండ్ల ఈ చిన్న వీడియోను వినియోగదారులు ట్విట్టర్‌లో అనేక సార్లు షేర్ చేశారు. ఈ క్లిప్ చూసి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కూడా స్పందించింది . సర్, దిద్దుబాటు చర్యల కోసం సంబంధిత అధికారికి సమాచారం అందించబడింది అని రైలు అధికారులు కామెంట్ చేసారు.