Vangaveeti Radha: ఏపీ రాజకీయాలలో 3వ ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదే దిశగా తన ప్రయాణం కొనసాగిస్తున్నారు. అయితే పార్టీ పెట్టి దశాబ్ద కాలం అవుతున్న కూడా ఇప్పటికీ సంస్థగా పార్టీ నిర్మాణం లేకపోవడం జనసేనకు ప్రధాన మైనస్ అని చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో మాత్రం వైయస్ జగన్ ని ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించుతా అంటూ పవన్ కళ్యాణ్ బీరాలు పోతున్నాడు. అయితే ఆ పార్టీకి ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా గట్టిగా ప్రజలను ఆకర్షించే సొంత బలంతో గెలవగలిగే నాయకుడు లేడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఉన్న నాయకులు కూడా జనసేన పార్టీ విధానాలు నచ్చక పవన్ కళ్యాణ్ కి దూరం అవుతూ వస్తున్నారు.
అయితే తమ పార్టీ బలం మాత్రం పెరిగిపోయింది అంటూ జనసేన నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో జనసేన పార్టీలోకి వంగవీటి రాధా వస్తారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. జన సైనికులు అందరూ కూడా వంగవీటి రాధ ఎంట్రీ ఇస్తున్నాడంటూ డప్పు కొట్టుకొని మరి చెప్పారు. అయితే తాజాగా నారా లోకేష్ పాదయాత్రలో వంగవీటి రాధా పాల్గొనడమే కాకుండా ఆయనతో రెండు గంటల పాటు ప్రత్యేకంగా సమావేశం కావడం చర్చినియాంశంగా మారింది.
దీంతో రాధా జనసేనలోకి వస్తాడని ప్రచారానికి పుల్ స్టాప్ పడినట్లు అయింది. అలాగే వైసిపి నుంచి చాలామంది నాయకులు జనసేనలోకి వస్తారని జన సైనికులు ప్రచారం చేస్తున్నారు. అయితే పరిణామాలు చూస్తుంటే ఏ ఒక్కరు కూడా జనసేన గూటికి వెళ్లేందుకు సిద్ధంగా లేరని టాక్ రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. జనసేన టిడిపితో పొత్తు పెట్టుకుంటే కాపుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్లేనని భావిస్తున్న కాపు సంఘం నాయకులు కూడా పవన్ కళ్యాణ్ కి దూరం జరుగుతున్నట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట.