Varalakshmi Sharath Kumar: సినిమా రివ్యూల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక మూవీ ముందుగానే మొదటి ఆటని థియేటర్స్ లో చూసి ఫిలిం క్రిటిక్స్ రివ్యూలు రాస్తూ ఉంటారు. ఆ సినిమా ఎలా ఉంది అనేది చెప్పడంతో పాటు కథలో లోటు పాట్లు గురించి కూడా రివ్యూలో రాస్తూ ఉంటారు. అలాగే పాజిటివ్స్, నెగిటివ్స్ కూడా మెన్సన్ చేస్తారు.
కచ్చితంగా సినిమా సక్సెస్ లో ఈ రివ్యూల పాత్ర చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే రివ్యూలపై సెలబ్రిటీలకి ఎప్పుడు కూడా సరైన అభిప్రాయం ఉండదు. సినిమా బాగుందా లేదా అనేది ప్రేక్షకుడు థియేటర్స్ కి వెళ్లి చెప్పాలని, అలా కాకుండా రివ్యూల పేరుతో ముందుగా సినిమా ఎలా ఉందో చెప్పే హక్కు రివ్యూ రైటర్స్ కి ఎవరిచ్చారు అంటూ సెలబ్రిటీలు విమర్శలు చేస్తూ ఉంటారు.

అయితే సినీ తారలు ఎన్ని విమర్శలు చేసిన కూడా ఫిల్మ్ క్రిటిక్స్ వారు రాయాల్సిన రివ్యూలు రాస్తూనే ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా రివ్యూలు రాసేవారిపై తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. తన కోపాన్ని బయటపెట్టింది. అసలు సినిమా ఎలా ఉందో చెప్పడానికి మీరెవరు. ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చి నచ్చితే చూస్తారు, లేదంటే మానేస్తారు.
నచ్చేది లేనిదీ వారు చెబితే ఒకే అంతేగాని ముందే ఒక సినిమా రిజల్ట్ ని మీరు ఎలా డిసైడ్ చేస్తారు అంటూ వరలక్ష్మి శరత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే కథలో లో అది బాగోలేదు, ఇది బాగోలేదు అని చాలా సింపుల్ గా రాసేస్తారు. అసలు ఒక సినిమా వెనుక కష్టం మీకు తెలిస్తే ఇలాంటి విమర్శలు సినిమాపై చేయరు అంటూ వరలక్ష్మి విమర్శలు చేసింది. ఇప్పుడు ఆమె విమర్శలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.