టాలీవుడ్ లో చాలా మంది హీరోలు ఏదో ఒక బ్యాగ్రౌండ్ నుంచి ఇండస్ట్రీలో అడుగుపెట్టినవారే ఎక్కువ మంది ఉన్నారు కొంత మంది మాత్రమే ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సక్సెస్ ఫుల్ హీరోలుగా ఎదిగిన వారు ఉన్నారు. వారిలో ఎన్టీఆర్, ఏఎన్నార్, మెగాస్టార్ చిరంజీవి, రవితేజ లాంటి స్టార్స్ అందరూ కూడా ఒంటరిగా ఇండస్ట్రీలోకి వచ్చి తమ స్వశక్తితో ఎదిగిన వారే. అయితే కొంత మంది నటులు మాత్రం ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ నుంచి ఇండస్ట్రీలో హీరోలుగా అడుగుపెడతారు. అలాంటి వారిలో సక్సెస్ అందుకున్న వారు తక్కువ మందే ఉంటారు. అయితే కొంత మంది హీరోలుగా మంచి ఇమేజ్ సొంతం చేసుకొని అర్ధంతరంగా సినిమాలకి దూరమైనా వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో వేణు తొట్టెంపూడి కూడా ఒకరు. మంచి కామెడీ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని వేణు సొంతం చేసుకున్నాడు.
ప్రస్తుతం స్టార్ దర్శకుడుగా కొనసాగుతున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా వేణు కావడం విశేషం. అలాగే కామెడీ, లవ్ స్టొరీ కథలకి వేణు కొంత కాలం పాటు కేరాఫ్ అడ్రెస్ గా మారాడు. చిరునవ్వుతో, స్వయంవరం చెప్పవే చిరుగాలి హనుమాన్ జంక్షన్, కళ్యాణ రాముడు, పెళ్ళాం ఊరేలితే, గోపి గోపిక గోదావరి లాంటి సినిమాలతో హీరోగా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. తరువాత హీరోగా సినిమాలకి గ్యాప్ ఇచి దమ్ము సినిమాలో కీలక పాత్రలో మెప్పించాడు. ఆ మూవీ తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకొని తాజాగా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో పోలీస్ ఆఫీసర్ లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్ మళ్ళీ మొదలు పెడుతున్నాడు. ఇదిలా ఉంటే వేణు హీరోగా అందరికి సుపరిచితమే.
అయితే అతని ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. వేణు మామయ్య మాగంటి అంకినీడుతెలుగునాట ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. గాంధీజీ మార్గంలో నడిచ్చి ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించారు. అంతకు మించి అతనికి మరో ట్రాక్ రికార్డు కూడా ఉంది. గుడివాడ నుంచి మూడు సార్లు, మచిలీపట్నం నుంచి రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా లోక్ సభకి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఇక వేణు హీరోగా ఎంట్రీ ఇచ్చిన సమయంలో తన మామయ్యా మాగంటి అంకినీడు ఆటపట్టించే వారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వేణు రివీల్ చేసారు. నీ సినిమా అడిగితే నా మేనల్లుడివి అని అందరికి పరిచయం చేస్తాను, లేదంటే చేయను అనేవారని చెప్పుకొచ్చారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా వేణు మేనమామ మాగంటి అంకినీడు అనే విషయం అందరికి అర్ధమైంది.