Vicky Kaushal : బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తాను ప్రేమించి పెళ్లిచేసుకున్న బాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి ఆసక్తికరమైన విషయాలను తాజాగా చేసిన ఓ ఇంటర్వ్యూ లో పంచుకున్నాడు. విక్కీ కౌశల్ పెళ్లి తర్వాత జీవితం గురించి మాట్లాడాడు కత్రినాకు నేను పర్ఫెక్ట్ భర్త కాదని ఓపెన్ అయిపోయాడు. ఈ మాట వినగానే విక్కీ , కత్రినా ఫ్యాన్స్ ఒక్కసారిగా అవాక్కయ్యారు. విక్కీ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని ఆశ్చర్యపోయారు. అసలు విషయానికి వస్తే కత్రినా గురించి విక్కీ మాట్లాడుతూ, అతను తన భార్యను ఎంతగా ప్రేమిస్తున్నాడో చెప్పుకొచ్చాడు ఒక భర్తగా ఉత్తమ వెర్షన్‌గా ఉండటానికి తాను ప్రయత్నిస్తున్నాని తెలిపాడు.

విక్కీ, కత్రినా కైఫ్ లు డిసెంబర్ 2021 లో రాజస్థాన్‌లో కొద్దిమంది సన్నిహితుల నడుమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుండి, ఈ జంట ముంబైలో ఉంటోంది. అనేక కార్యక్రమాలకు కలిసి హాజరవుతూ అభిమానులను అలరిస్తున్నారు. విక్కీ , కత్రినా పెళ్ళైన తర్వాత కలిసి ఒక్క సినిమాకి కూడా సైన్ చేయలేదు. గత సంవత్సరం ఆన్లైన్ ట్రావెల్ కంపెనీని ప్రమోట్ చేస్తున్నప్పుడు ఒక ప్రకటనలో కలిసి కనిపించారు. వివాహం జరిగిన రెండు సంవత్సరాలలో చాలా విషయాలను నేర్చుకున్నానని విక్కీ తెలిపాడు.

ఐడియల్ మ్యన్ ఇమేజ్ గురించి అడిగినప్పుడు, భర్తగా, కొడుకుగా, స్నేహితుడిగా, నటుడిగా నేను ఏ విధంగానూ పర్ఫెక్ట్ గా లేను అని విక్కీ సమాధానం ఇచ్చాడు. ఇక పెళ్లి విషయానికి వస్తే పర్ఫెక్ట్ ఉండటం ఎండమావి లాంటిది, అని మీకు తెలుసా? మీరు అక్కడికి చేరుకుంటున్నట్లు మీకు ఎప్పుడూ అనిపిస్తుంది, కానీ మీరు ఎప్పుడూ చేరుకోలేరు . కాబట్టి, నేను పరిపూర్ణ భర్తనని నేను అనుకోను. కానీ నేను ఏ క్షణంలోనైనా భర్త యొక్క ఉత్తమ వెర్షన్‌గా ఉండటానికి ప్రయత్నిస్తాను అని అన్నాడు . మీరు ఒక వ్యక్తితో జీవించడం ప్రారంభించినప్పుడు , మీకు తోడుగా ఉన్నప్పుడు మీరు చాలా నేర్చుకుంటారు. గత 2 సంవత్సరాలలో , నేను అంతకుముందు సింగిల్ గా ఉన్న దాని కన్నా చాలా ఎక్కువ విషయాలను నేర్చుకున్నానన్నాడు.
