Vijay Devarakonda : టాలీవుడ్ రౌడీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఈ సినిమానే ప్రస్తావించడానికి కారణం ఆ సినిమాలోని బోల్డ్‌నెస్. ఇప్పటి వరకూ మళ్లీ అలాంటి సినిమాల జోలికి విజయ్ దేవరకొండ వెళ్లలేదనే చెప్పాలి. అయితే ఈ సినిమా కేవలం పోస్టర్స్ కారణంగానే విపరీతమైన ప్రచారం జరిగిపోయింది. ఇప్పుడు విజయ్ అప్‌కమింగ్ మూవీ కూడా ఆయన కటౌట్ కారణంగానే ప్రమోషన్ జరుపుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ యంగ్ హీరో నటిస్తున్న చిత్రం ‘లైగర్’. విజయ్‌కు మొదటి పాన్ ఇండియా చిత్రం కూడా ఇదే కావడం విశేషం. సాలా క్రాస్ బ్రీడ్ అనే ట్యాగ్ లైన్‌తో ఈ చిత్రం రూపొందింది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటించింది. అమ్మడికి ఇదే తొలి సౌత్ ఇండియా సినిమా కావడం విశేషం.
Vijay Devarakonda : ఎంఎంఏ ఫైటర్ బాక్సర్‌గా..
కాగా.. ‘లైగర్’ చిత్రానికి సంబంధించి విజయ్ దేవరకొండ కటౌట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ 35 ఎం ఎం థియేటర్ వద్ద లైగర్ మూవీలోని 75 ఫీట్ల విజయ్ భారీ కటౌట్‌ను పెట్టారు. ఈ కటౌట్.. అర్జున్‌రెడ్డి పోస్టర్ తరహా ప్రచారమే జరుగుతోంది. ఆ ప్రచారానికి దీనికి సంబంధం లేకున్నా.. ప్రమోషన్స్ విషయంలో భారీగా సాయపడుతోంది. ఈ సినిమాలో విజయ్ ఎంఎంఏ ఫైటర్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఇంటర్నేషనల్ ప్లేయర్ మాదిరిగా ఈ కటౌట్‌లో మన యంగ్ హీరో కనిపిస్తున్నాడు. విజయ్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో ఆ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. జాతీయ జెండాను పట్టుకుని విజయ్ కనిపించాడు. అయితే యూత్‌ను మాత్రం తన సిక్స్ ప్యాక్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఈ కటౌట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఇక ఈ సినిమాను రూ.120 కోట్ల బడ్జెట్‌తో బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జొహార్‌తో కలిసి పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా పిక్స్ చేసుకుంది. ఆగస్టు 25న తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌లో బిజీబిజీగా గడిపేస్తోంది. ‘అర్జున్‌రెడ్డి’ మూవీ కేవలం పోస్టర్స్‌తో భారీగా ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఏర్పాటు చేసిన భారీ కటౌట్ కూడా ఆ రేంజ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి విజయ్‌కు ఈ ప్రచారం బాగా కలిసొస్తుందనడంలో సందేహం లేదు.